Vijayasai: చంద్రబాబు ఆనందం కోసమే షర్మిల పోరాటం..: విజయసాయి రెడ్డి
ABN, Publish Date - Oct 27 , 2024 | 12:25 PM
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకూడదని షర్మిల భావిస్తున్నారని, ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు.. కానీ జగన్ మళ్ళీ సీఎం కావొద్దని షర్మిల కంకణం కట్టుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. శత్రవులకు మేలు చేయటం కోసం.. సొంత అన్నకు అన్యాయం చేసే వాళ్ళని ఎవర్నీ చూడలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి కారకులు ఎవరో గుండెపై చేయి వేసుకుని షర్మిల చెప్పాలన్నారు.
హైదరాబాద్: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మాజీ సీఎం జగన్‌పై (Ex Cm Jagan) చేసిన వ్యాఖ్యాలపై ఎంసీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలది ఆస్తి తగాదా కాదని.. అధికారం కోసం తగాదా అని అన్నారు. 95 శాతం షర్మిల ప్రెస్ మీట్లు జగన్‌ను తిట్టడానికి పెట్టినవేనని..చంద్రబాబు (Chandrababu) కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే జగన్‌పై ఆమె పోరాటం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ మరణానికి కారణమైన కాంగ్రెస్, చంద్రబాబుతో షర్మిల చేతులు కలపటం బాధాకరమని అన్నారు. తండ్రి మరణానికి చంద్రబాబు కారణమని గతంలో అనేకసార్లు షర్మిల చెప్పలేదా అని ప్రశ్నించారు.
జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోకూడదని షర్మిల భావిస్తున్నారని, ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లేదు.. కానీ జగన్ మళ్ళీ సీఎం కావొద్దని షర్మిల కంకణం కట్టుకున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. శత్రవులకు మేలు చేయటం కోసం.. సొంత అన్నకు అన్యాయం చేసే వాళ్ళని ఎవర్నీ చూడలేదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడానికి కారకులు ఎవరో గుండెపై చేయి వేసుకుని షర్మిల చెప్పాలన్నారు. చంద్రబాబు అజెండాను షర్మిల అమలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోకగజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డిని ఉపయోగించి చంద్రబాబు జగన్‌ను జైలుకు పంపారని, పీసీసీ అధ్యక్షురాలిగా.. వైఎస్ తనయగానా.. జగన్ చెల్లిగా మాట్లాడుతున్నారో షర్మిల చెప్పాలని.. లేక కాంగ్రెస్ కోసమా.. చంద్రబాబు కోసం పనిచేస్తున్నారా అన్నది షర్మిల చెప్పాలని విజయసాయి డిమాండ్ చేశారు. లక్షల మంది అక్కచెల్లెళ్ళకు.. తన హాయాంలో జగన్ మేలు చేశారని, జగన్ మోచేతి నీళ్ళు తాగి లబ్ధి పొందానని షర్మిల తన పేరు వాడినందునే తాను స్పందిస్తున్నానని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డి మాటల్లో భయం..
జగన్‌ను.. తనను మళ్లీ అరెస్టులు చేయవచ్చంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయించటానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని, తన అజెండా కోసం చంద్రబాబు.. షర్మిలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. సీఎంతో కలసి జగన్‌ను మళ్ళీ జైలుకు పంపాలని షర్మిల భావిస్తున్నారని విమర్శించారు. వైఎస్ ఉండగానే జగన్, షర్మిలకు ఆస్తుల పంపకం జరిగిందని, తన నేర్పరితనంతో, తెలివితేటలతో జగన్ వ్యాపారాలను వృద్ది చేసుకున్నారని, వ్యాపారాలపై జగన్‌కు విజన్ ఉందన్నారు. కోర్టు కేసులు పరిష్కారం అయ్యాక 40 శాతం వాటా చెల్లెలకు ఇస్తానని జగన్ చెప్పారని, షర్మిలకు వచ్చిన ఆస్తుల్లో 40 శాతం ఆస్తులు జగన్‌కు ఇస్తారా అని విజయసాయి ప్రశ్నించారు.
చంద్రబాబును గెలిపించి జగన్‌కు షర్మిల రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని, బాబుతో లాలూచీ పడి .. జగన్‌ను ఇబ్బందులు పెట్టడం షర్మిల ఉద్దేశమని విజయసాయి ఆరోపించారు. అస్తుల్లో వాటా ఆడుగుతున్న షర్మిల.. నష్టాలను ఎందుకు భరించలేదని ప్రశ్నించారు. భారతీ సిమెంట్స్ పేరును తానే ఖాయం చేశానని, తన వ్యాపారాలకు జగన్ తన కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటే తప్పేంటన్నారు. పెళ్ళి జరిగిన 20 ఏళ్ళ తర్వాత.. చెల్లికి రూ. 200 కోట్లు ఇచ్చిన అన్న దేశంలో ఎవరైనా ఉన్నారా అని అన్నారు. తన అతి మంచితనం వలనే అనార్థాలను జగన్ కొని చెచ్చుకున్నారని, జగన్, షర్మిల మధ్య జరిగిన అన్నీ విషయాలు తనకు తెలుసునని అన్నారు. ఎపిసోడ్‌కు ఇక్కడితో ముగింపు పలకాలని షర్మిలను కోరుతున్నానని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ క్రియాశీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్న ప్రత్తిపాటి
నవంబర్ 30 నాటికి కుల గణన పూర్తి: మంత్రి పొన్నం
స్వంత నిధులతో ముందడుగు వేసాం: కేటీఆర్
7 గురు ప్రభుత్వ వైద్య కళాశాల పిన్సిపాళ్ల బదిలీ
ఈక్వెనెక్స్ డాటా సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేష్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 27 , 2024 | 12:25 PM