YS Bharathi PA: నా భర్తకు ఏదైనా జరిగితే.. హోం మంత్రిదే బాధ్యత
ABN, Publish Date - Nov 06 , 2024 | 09:39 PM
గత జగన్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో వైఎస్ భారతి పీఏ వర్రా రవీందర్ రెడ్డి కీలకంగా వ్యవహించారు. ఆ సమయంలో అతడి వ్యవహరించిన తీరుపై పలు పోలీస్ స్టేషన్‌లో కేసులు సైతం నమోదయ్యాయి. ఆ క్రమంలో అతడిని కడప చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌కు విచారణలో భాగంగా తీసుకు వచ్చారు. ఈ విషయం తెలిసిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వెంటనే స్పందించారు. వర్రా రవీందర్ రెడ్డిని వెంటనే వదిలి వేయాలంటూ స్థానిక పోలీసులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దాంతో వర్రా రవీందర్ రెడ్డిని వదిలి వేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.
కడప, నవంబర్ 06: గత ప్రభుత్వ హయాంలో వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అతడి భార్య కల్యాణి బుధవారం కడపలో ఆరోపించారు. తన భర్త రవీందర్‌రెడ్డికి ఏదైనా జరిగితే హోం మంత్రి అనితతోపాటు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి సుమారు 30 మంది పోలీసులు పులివెందుల్లోని తమ నివాసానికి వచ్చి.. తన భర్తను బలవంతంగా తీసుకు వెళ్లారని ఆమె తెలిపారు.
Also Read: YCP Ex MLA: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులు
Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు
ఏ కేసుపై ఆయన్ని తీసుకు వెళ్తున్నారంటూ తాను ప్రశ్నించినా.. పోలీసులను నుంచి సమాధానం మాత్రం రాలేదని ఆమె చెప్పారు. అయితే తన భర్తను అదుపులోకి తీసుకున్నారనే విషయంపై కడప వచ్చి పోలీస్ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. డ్రామాలాడుతున్నారా? అంటూ తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కళ్యాణి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో తన భర్తకు ఏదైనా జరిగితే.. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
Also Read: TG Politics : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ఇంతకీ ఏం జరిగింది?
గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వర్రా రవీందర్ రెడ్డి.. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారు. అలాగే వైఎస్ ఫ్యామిలీలోని ఓ వర్గం అంటే.. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతోపాటు వైఎస్ సునీతలే లక్ష్యంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు సైతం చేశారీ వర్రా రవీందర్ రెడ్డి.
Also Read: Thinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read: సబ్జా గింజలతో ఇన్ని లాభాలున్నాయా..?
ఈ నేపథ్యంలో ఆయా పోస్ట్‌లపై గతంలోనే ఫిర్యాదులు అందాయి. దాంతో గత రాత్రి వర్రా రవీందర్ రెడ్డిని కడప చిన్న చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చి ప్రశ్నించారు. అనంతరం అతడికి 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలి వేశారు.
Also Read: karthika Masam 2024: కార్తీక మాసంలో పాటించ వలసిన నియమాలు.. పఠించ వలసిన స్తోత్రాలు
అయితే అతడిపై ఉమ్మడి కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. అందులోభాగంగా ప్రొద్దుటూరు పోలీసులు అతడిని అరెస్ట్ చేసేందుకు అక్కడికి వచ్చారు. ఆ విషయం తెలియని కడప చిన్న చౌక్ పోలీసులు అతడిని పంపించేశారు. దీంతో ఈ విషయంపై పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ఈ వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఉన్నతాధికారులు భావించారు.
Also Read: డొనాల్డ్ ట్రంప్‌కు వెల్లువెత్తిన అభినందనలు
ఆ క్రమంలో కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతోపాటు కడప నగరంలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ సీఐపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆదేశాల మేరకే వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు విడిచి పెట్టారంటూ నిఘా వర్గాలకు సమాచారం అందిందింది. దీనిని ప్రభుత్వానికి నివేదించింది. దాంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వం మారిన ఇంకా గత ప్రభుత్వ పెద్దల మాటలు పోలీసులు తూ చా పాటిస్తున్నారంటూ.. అందుకే వారిపై ఈ వేటు వేసినట్లు ఓ చర్చ సైతం సాగుతుంది.
For AndhraPradesh News And Telugu News...
Updated Date - Nov 06 , 2024 | 09:39 PM