Share News

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ కేడర్.. టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి..

ABN , Publish Date - Jun 06 , 2024 | 10:37 AM

అధికారం కోల్పోయామనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం సాగిన తమ అరాచకాలు ఇంకా సాగుతాయనుకున్నారో ఏమో గానీ.. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న టీడీపీ కార్యకర్తలపై అటాక్ చేశారు. టీడీపీ శ్రేణులు ప్రయాణిస్తున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు వైసీపీ శ్రేణులు.

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ కేడర్.. టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి..
YSRCP Cadre Attack on TDP Leaders

అన్నమయ్య జిల్లా, జూన్ 06: అధికారం కోల్పోయామనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం సాగిన తమ అరాచకాలు ఇంకా సాగుతాయనుకున్నారో ఏమో గానీ.. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న టీడీపీ కార్యకర్తలపై అటాక్ చేశారు. టీడీపీ శ్రేణులు ప్రయాణిస్తున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు వైసీపీ శ్రేణులు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బోయపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాయబోచి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపొందడంతో.. ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. తమ అభిమాన నాయకుడు గెలుపొందడంతో మాధవరం గ్రామంలో టీడీపీ నేత ఒకరు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు టీడీపీ శ్రేణులు వెళ్తుండగా వారి వాహనాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. రాళ్లు రువ్వారు. టీడీపీ కార్యకర్తల వెంట ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి కూడా ఉన్నారు. దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాంప్రసాద్, పోలీసులు.. ఘటనా స్థలికి వెళ్లారు. దాడిలో గాయపడిన బాధితులతో కలిసి రాయచోటి అర్బన్ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వైసీపీ నాయకులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని.. పోలీసులను ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి కోరారు.


మారని తీరు..

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం పోయిన వైసీపీ శ్రేణులు అరాచక బుద్ధి మాత్రం మారడం లేదు. అధికారం కోల్పోయామనే అక్కసుతో రెచ్చిపోతున్నారు. టీడీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులుకు టీడీపీ నేతలు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. సరిగా ఉంటే తాము మీ జోలికి రాబోమని.. రెచ్చిపోతే తాట తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 06 , 2024 | 10:37 AM