ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kesineni Chinni: నాలుగున్నరేళ్లలో వ్యాపారులను ఇబ్బంది పెట్టిన జగన్ ప్రభుత్వం

ABN, Publish Date - Mar 07 , 2024 | 09:47 PM

జగన్ ప్రభుత్వం (Jagan Govt) గత నాలుగున్నరేళ్లుగా వ్యాపారస్తులు, ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) అన్నారు. గురువారం నాడు గంపలగూడెం తోటమూల సెంటర్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలతో కలిసి చిన్ని ప్రారంభించారు. గంపలగూడెంలో భారీ ర్యాలీతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Kesineni Chinni

ఎన్టీఆర్ జిల్లా: జగన్ ప్రభుత్వం (Jagan Govt) గత నాలుగున్నరేళ్లుగా వ్యాపారస్తులు, ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) అన్నారు. గురువారం నాడు గంపలగూడెం తోటమూల సెంటర్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలతో కలిసి చిన్ని ప్రారంభించారు. గంపలగూడెంలో భారీ ర్యాలీతో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిన్ని, తిరువూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు, జనసేన నాయకురాలు రావి సౌజన్య, బోలియశెట్టి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ... రాబోయే రెండు నెలల్లో జనసేన - టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు.

వ్యాపారస్తులకు చంద్రబాబు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పారు. వ్యాపారులకు ఇష్టమైన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రోశయ్య చనిపోయినప్పుడు దండ కూడా వేయటానికి ఇష్టపడిని జగన్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని మండిపడ్డారు. ఎంత విద్వేషం, ద్వేషం ఉన్న నాయకులు ఉన్నారో వ్యాపారులు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పారు. తాము అధికారంలో రాగానే వ్యాపారులకు ఎలాంటి వేధింపులు ఉండవని హామీ ఇచ్చారు. టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు అండగా ఉంటారని తెలిపారు. శ్రీనివాసరావు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లను తయారు చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తి చేతుల్లో మన నియోజకవర్గం ఉందంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎంతో ఉన్నతంగా ఉంటుందని కేశినేని చిన్ని పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 09:47 PM

Advertising
Advertising