Share News

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ రచ్చలో కీలక పరిణామం.. చర్చలతో ఫుల్ స్టాప్!

ABN , Publish Date - Aug 12 , 2024 | 09:16 PM

ఒకటా రెండా.. వారం రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. దువ్వాడ.. దువ్వాడ.. దువ్వాడ.. ఇదే టాపిక్..! ఎందుకంటే.. ‘ఆయనకు ఇద్దరు’ ఎపిసోడ్‌లో గంటకో ట్విస్ట్‌.. ట్విస్ట్‌లు ట్విస్టులు.. లెక్కలేనన్ని వెలుగుచూశాయ్..! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ రచ్చలో సోమవారం నాడు కీలక పరిణామమే జరిగింది. రెండో ఇంటి రచ్చపై..

Duvvada Srinivas: దువ్వాడ ఫ్యామిలీ రచ్చలో కీలక పరిణామం.. చర్చలతో ఫుల్ స్టాప్!
Duvvada Family Controversy

శ్రీకాకుళం/అమరావతి : ఒకటా రెండా.. వారం రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా.. దువ్వాడ.. దువ్వాడ.. దువ్వాడ.. ఇదే టాపిక్..! ఎందుకంటే.. ‘ఆయనకు ఇద్దరు’ ఎపిసోడ్‌లో గంటకో ట్విస్ట్‌.. ట్విస్ట్‌లు ట్విస్టులు.. లెక్కలేనన్ని వెలుగుచూశాయ్..! వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) ఫ్యామిలీ రచ్చలో సోమవారం నాడు కీలక పరిణామమే జరిగింది. రెండో ఇంటి రచ్చపై సెటిల్మెంట్ చర్చలు జరిగాయి. టెక్కలి నియోజకవర్గమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా.. అటు మీడియాలో ఇటు నెట్టింట్లో ఒక్కటే చర్చ.. రచ్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన కుటుంబ సభ్యులు, బంధువులు రంగంలోకి దిగిపోయి చర్చల దిశగా అడుగులు వేశారు. దువ్వాడ సతీమణి వాణికి ఏం కావాలి..? డిమాండ్లు ఏంటి..? అని కోరగా.. కుమార్తె, తల్లిదండ్రులతో చర్చించిన ఆమె.. ఐదు డిమాండ్లు భర్త ముందు పెట్టారు. ఆ ఐదు డిమాండ్లు ఏంటనేది బయటికి రాలేదు కానీ.. చర్చలు మాత్రం దాదాపు కొలిక్కి వచ్చేసినట్లేనని సమాచారం. ఒక్క ఆస్తి పంపకాల విషయంలో క్లారిటీ వస్తే దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోయినట్టేని తెలుస్తోంది.


Assets.jpg

ఎట్టకేలకు.. గంటల తర్వాత!

దువ్వాడ ఫ్యామిలీ రచ్చలో సుమారు మూడు నుంచి నాలుగు గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. చర్చల్లో దువ్వాడ తరపున సోదరుడు శ్రీధర్.. వాణి తరుపున సోదరి పాల్గొన్నారు. అటు, ఇటు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడగా ఫ్యామిలీ వ్యవహారం కొలిక్కి వచ్చేసినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి చూస్తే.. వారం రోజుల రచ్చకు.. మూడు, నాలుగు గంటల చర్చలతో ఫుల్ స్టాప్ పడ్డాయి. ఈ రచ్చలోకి కుటుంబ సభ్యుల ఎంట్రీతో ఫ్యామిలీ వివాదానికి ఫుల్ స్టాప్ పడిపోయిందన్న మాట. మొత్తానికి చూస్తే.. ముగింపు దశలో రెండిళ్ల దువ్వాడ.. ఫ్యామిలీ కథా చిత్రమ్ ఉందన్న మాట. ఇవాళ రాత్రి లేదా మంగళవారం మధ్యాహ్నానికి ఈ మొత్తం వ్యవహారానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి.


Duvvada-Family-Fight.jpg

ఎన్ని ట్విస్టులో..!

ఓ వైపు సతీమణి వాణి.. మరోవైపు దివ్వెల మాధురీ.. ఇంకోవైపు దువ్వాడ శ్రీనివాస్ ముగ్గురూ వారం రోజులుగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..! దువ్వాడ-మాధురీ ఉంటున్న ఇంటి ముందు వాణి, కుమార్తె నిరసన తెలపడం.. ఇది కాస్త గొడవ దాకా వెళ్లి ఒకానొక సందర్భంలో కొట్టబోయారు దువ్వాడ శ్రీనివాస్. పోలీసుల రంగ ప్రవేశంతో కాస్త గొడవ సద్దుమణిగినా నిరసన మాత్రం కంటిన్యూ అవుతూనే వచ్చింది. న్యాయం కావాల్సిందేనని వాణి, కుమార్తె పట్టుబట్టి కూర్చున్నారు.. ఆఖరికి పోలీసు కేసుల దాకా కూడా ఈ వ్యవహారం వెళ్లింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని మరింత రచ్చకెక్కింది కుటుంబం. మరోవైపు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు.. సంచలన వ్యాఖ్యలతో మీడియా, సోషల్ మీడియా మొత్తం మార్మోగింది. ఈ క్రమంలోనే తనపై, తన బిడ్డలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. అవన్నీ జీర్ణించుకోలేకపోతున్నట్లు కారును ప్రమాదానికి గురి చేసిన మాధురీ.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు బతకాలని లేదని ట్రీట్మెంట్ వద్దని నానా రచ్చే చేశారు మాధురి. ఇలా ఒకటా రెండా.. లెక్కలేనన్ని ట్విస్టులే చోటుచేసుకున్నాయి. మాధురీ యాక్సిడెంట్ ఘటనతో మరింత ముదిరిపోయిందీ ఫ్యామిలీ రచ్చ. ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన కుటుంబ సభ్యులు, బంధువులు చర్చలు దిగడంతో రచ్చకు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది.

Duvvada-And-Madhuri.jpg

Updated Date - Aug 12 , 2024 | 09:41 PM