ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pattabhiram : తాడేపల్లి ప్యాలెస్‌కు కొందరు అధికారులు ఊడిగం చేస్తున్నారు

ABN, Publish Date - Apr 06 , 2024 | 11:03 PM

తాడేపల్లి ప్యాలెస్‌కు కొందరు అధికారులు ఊడిగం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్( Kommareddy Pattabhiram) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్(జగన్ పర్సనల్ సర్వీస్) అధికారులుగా మారారని మండిపడ్డారు.

అమరావతి: తాడేపల్లి ప్యాలెస్‌కు కొందరు అధికారులు ఊడిగం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్( Kommareddy Pattabhiram) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు ఐఏఎస్ అధికారులు జేపీఎస్(జగన్ పర్సనల్ సర్వీస్) అధికారులుగా మారారని మండిపడ్డారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్‌కి ఊడిగం చేస్తూ..ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లేలా వ్యవహరించారని ధ్వజమెత్తారు.

టీడీపీ పక్షాన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఇతర పార్టీ నేతలు ఐపీఎస్ అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేశారని, వాళ్లు ఫిర్యాదులో వాస్తవం లేదని సీఈసీకి ఫిర్యాదు చేయటం సిగ్గుచేటన్నారు. అధికారులు తప్పు చేస్తుంటే బాధ్యత గల ప్రతిపక్షంగా నిలదీయటం తప్పా? అని ప్రశ్నించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు బృదం దాడి చేస్తే వారికి శిక్షలుండవా అని నిలదీశారు. ఐపీఎస్ అధికారుల సంఘం తీరు సరికాదన్నారు. అధికారుల బదిలీలతో ఉపయోగం లేదని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:03 PM

Advertising
Advertising