ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీపై ‘సిట్‌’కు ఏపీ సర్కార్ ఆదేశం

ABN, Publish Date - Sep 23 , 2024 | 09:53 AM

Andhrapradesh: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు సంబంధించిన విధివిధానాలు రూపొందే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారిగా ఎవర్ని వెయ్యాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది

Tirumala Laddu

అమరావతి, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ (Tirumala laddu) కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తునకు సంబంధించిన విధివిధానాలను రూపొందించే అవకాశాలు ఉన్నాయి. దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు (సోమవారం) సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరుతో జీవో విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

Viral Video: ఓరి నాయనో.. రన్నింగ్ ట్రైన్‌లో కూడా పాము.. ఏసీ కోచ్‌లో ప్రత్యక్షమైన నాగరాజు.. ప్రయాణికుల కేకలు..


తప్పు తప్పే..: చంద్రబాబు

తిరుమల లడ్డూ కల్తీపై ఐజీ, అంతకంటే పైస్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న (ఆదివారం) మంత్రులతో కలిసి సీఎం మీడియా సమావేశం నిర్వహించి లడ్డూ వ్యవహారంపై మాట్లాడారు. తిరుమలలో జరిగింది అపచారమని స్పష్టం చేశారు. ‘‘మనోభావాలు దెబ్బతిన్న హిందువులకు, ఇతర మతస్థులకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. అన్నింటి కంటే పెద్దదైన వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన సమయంలో అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి. వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా, వారికి కావలసిన పనులు చేయించుకునేందుకు టీటీడీని ఉపయోగించుకున్నారు. దానిపై చాలా మంది బాధపడ్డారు. ఏదైనా మళ్లీ ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత మేం తీసుకుంటాం. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టం చేశారు.


మనోభావాలు దెబ్బతిన్నాయి..

వైసీపీ అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు సభ్యులను నియమించారన్నారు. 50 మంది సభ్యులను నియమిస్తే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కనపడిన వారందరినీ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నియమించారని ఆక్షేపించారు. ‘‘శ్రీవారి దర్శనం టికెట్లను ఇష్టారీతిగా విక్రయించారు. దానిపై నేను, పవన్‌ కల్యాణ్‌ ధర్నాలు చేశాం. తిరుమలకు అనుమతించకపోవడంతో అలిపిరి వద్ద ధర్నా చేసి వెనక్కి వచ్చాం’’ అని గుర్తుచేశారు. అన్య మతస్తులకు ప్రాధాన్యమివ్వడం, దేవుడిపై నమ్మకం లేని వారిని దేవాలయాల్లో పెట్టడం, రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని వినియోగించారని విమర్శించారు. ‘‘వాళ్లు రాగానే నెయ్యి, ఇతర సరుకుల సరఫరాకు సంబంధించి రివర్స్‌ టెండర్ల పేరుతో నిబంధనలు మార్చారు. 18వ నిబంధనలో ఉన్న మూడేళ్ల అనుభవాన్ని ఏడాదికి తగ్గించారు. డెయిరీ పెట్టిన మూడేళ్ల తర్వాతకు బదులుగా ఏడాదిలోనే నెయ్యి సరఫరా చేయవచ్చని పెట్టారు. 4 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అనుభవం ఉండాలి. ఆ నిబంధనా తీసేశారు. అదే విధంగా 8 టన్నుల ఉత్పత్తి చేయాలన్న నిబంధనా తొలగించారు. రివర్స్‌ టెండరింగ్‌తో విన్యాసాలు చేశారు. పెద్ద సంస్థలు రాకుండా చేశారు. అనుభవం లేని వారికి, డెయిరీయే లేని వారికి అవకాశమిచ్చారు. దీంతో వారు నాసిరకం నెయ్యి సరఫరా చేశారు. కల్తీ నెయ్యితో అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి’’అని సీఎం చెప్పారు.

Jethwani Case: నటి జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్‌కు రిమాండ్..


నీది మనిషి పుట్టుకేనా..

‘‘భక్తుల మనోనోభావాలు దెబ్బతిని కుంగిపోయే పరిస్థితి తెచ్చారు. ఆ అధికారం ఎవరిచ్చారు? జగన్‌.. నీది మనిషి పుట్టుకేనా? కరుడు కట్టిన నేరస్థుడు రాజకీయ ముసుగులో ప్రజలను మోసం చేయడానికి వచ్చి.. అబద్ధాలను సత్యాలుగా చేయాలని చూస్తున్నప్పుడు ప్రమాదమని హెచ్చరిస్తున్నాం. ఎంత ధైర్యముంటే ఎదురుదాడి చేస్తారు? బోర్డు సభ్యులుగా ఎవరిని వేశారు? ఈవోగా ఎవరిని వేశారు? ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు వేంకటేశ్వరస్వామి వద్దకు రారు. కొడుకు చనిపోతే 12వ రోజు గుడికి వస్తావా (అప్పటి ఈవో ధర్మారెడ్డినుద్దేశించి)? అన్య మతస్థులు అబ్దుల్‌ కలాం, సోనియాగాంధీ కూడా అఫిడవిట్‌ ఇచ్చి తిరుమలకు వస్తే.. జగన్‌ ఎందుకు ఇవ్వలేదు? అన్ని అకౌంట్లూ స్వామి సెటిల్‌ చేస్తారని గతంలో కూడా పలు దఫాలు చెప్పాను. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు స్వామికి ఉన్నది ఏడుకొండలు కాదు.. రెండు కొండలేనంటే పోరాడాను. పాదయాత్ర చేసి ఏడుకొండలూ ఎక్కి మొక్కు తీర్చుకున్నా. దేవుడి పవిత్రత కాపాడేందుకు ఎన్నో చేశాం. అలాంటి పవిత్ర క్షేత్రంలో గడచిన ఐదేళ్లలో అపవిత్ర కార్యక్రమాలు చేశారు. వేంకటేశ్వరస్వామి లడ్డూకు ప్రత్యేకత ఉంది. దానికి కారణం ఎన్నో ఏళ్లుగా దానిని తయారుచేసే విధానమే. అందులోని పదార్థాలు స్వచ్ఛంగా ఉంటాయి. నాణ్యత లేకుండా వాడరు. సరఫరాదారులు కూడా పవిత్రమైన భావంతో సరఫరా చేస్తారు. లడ్డూ మాత్రమే కాదు, జిలేబీ, వడ, పొంగల్‌ దేనికదే ప్రత్యేకం. భోజన శాలలో వంటలు కూడా రుచికరంగా ఉంటాయి. లడ్డూకు 2009లో పేటెంట్‌ హక్కు కూడా వచ్చింది. దానిని కాపీ చేసే అవకాశమే లేదు. ఎంత ప్రయత్నించినా తిరుమల లడ్డూ మాదిరి లడ్డూ చేయలేకపోయారు. అలాంటి ప్రసాదంలో నాణ్యత లేదని, అపవిత్రం చేశారని ఎన్నో సార్లు భక్తులు ఆందోళన చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో అన్నదానం, ప్రాణదానం ప్రవేశపెట్టాం. ఎన్టీఆర్‌ వైకుంఠం కాంప్లెక్‌-1 నిర్మించారు. నేను వైకుంఠం కాంప్లెక్స్‌-2 నిర్మించా. రామ్‌దేవ్‌బాబాను తీసుకొచ్చి వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలతో అనుసంధానం చేసి తిరుమల అంతా ఆయుర్వేద మొక్కలు పెట్టి ప్రోత్సహించాను. శ్రీవారికి సంప్రదాయబద్ధంగా వస్త్రాలు సమర్పించే సమయంలో నాపై క్లెమోర్‌ మైన్స్‌ దాడి జరిగింది. ఆ భగవంతుడి కృపవల్ల బతికాను. అన్ని దేవాలయాల్లో అపవిత్రతపై దర్యాప్తు చేసి.. నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్‌లో నెయ్యి కల్తీ వంటివి జరగకుండా చేస్తాం. ఏ ప్రార్థనా మందిరాల్లో అయినా ఆ మతాల వారి నిర్వహణే ఉండాలి. అందులో నేరస్థులు గానీ, సంఘ విద్రోహ శక్తులు గానీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ఇవన్నీ మేం కచ్చితంగా పాటిస్తాం. అందరం మత సామరస్యం కాపాడుకోవాలి. అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తెచ్చి అమలు చేస్తాం. అన్ని దేవాలయాల్లో మహిళలను గౌరవించే విధంగా ప్రత్యేక సిఫారసులు తీసుకుని చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Hyderabad: రికార్డు క్రియేట్ చేసిన హైడ్రా..

హెచ్చరించినా మారలేదు!

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2024 | 11:29 AM