Sharmila: రాహుల్‌కు బేషరుతుగా క్షమాపణ చెప్పాల్సిందే.. షర్మిల డిమాండ్
ABN, Publish Date - Sep 18 , 2024 | 12:59 PM
Andhrapradesh: రాహుల్ గాంధీపై నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ వాస్తవాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారా అని మండిపడ్డారు.
విజయవాడ, సెప్టెంబర్ 18: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) పెద్ద టెర్రరిస్టు అంటూ బీజేపీ, శివసేన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నాడు వన్‌టౌన్‌లో కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila), మస్తాన్ వలీ, జేడీ శీలం, నరహరశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజి ధర్నాలో పాల్గొన్నారు. మోడీ కేడీ, కిలాడి అంటూ నినాదాలు చేశారు. నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు.
AP Cabinet: ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..
రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ వాస్తవాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారా అని మండిపడ్డారు. ఆయన అడిగిన అంశాలపై సమాధానాలు చెప్పే ధైర్యం ఉందా అని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని.. అదే తీవ్రవాదులకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని.. మంటలు రేపి అందులో చలి కాచుకుంటారని దుయ్యబట్టారు.
AP News: సీఎం చంద్రబాబుకు వరద బాధితుల కృతజ్ఞతలు
ముస్లింలు, దళితులకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలకే అన్ని కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. అట్టడుగు వర్గాలవారి కోసం బీజేపీ ఎప్పుడైనా పనిచేసిందా అని ప్రశ్నించారు. ప్రధాన పోస్టుల్లో ఎంతమంది ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలనలో దళితులపై 35శాతం దాడులు జరిగాయన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారన్నారు. బీజేపీ దారుణాలను ఎత్తిచూపి ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. నేడు రాహుల్ గాంధీకే బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్‌పై నోరుపారేసుకున్న నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ
AP Cabinet: ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..
Read LatestAP NewsAndTelugu News
Updated Date - Sep 18 , 2024 | 01:19 PM