ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: సజ్జలకు బిగ్ షాక్.. రాజీనామా చేస్తారా..?

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:55 AM

ప్రజల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ.. పార్టీ వాయిస్ వినిపించే సలహాదారుల నోటికి ఎన్నికల సంఘం తాళం వేసింది. ప్రభుత్వ సలహాదారులంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునేవాళ్లు కావడంతో.. వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ కీలక ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమందికి బిగ్ షాక్ తగిలినట్లైంది.

ప్రజల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ.. పార్టీ వాయిస్ వినిపించే సలహాదారుల నోటికి ఎన్నికల సంఘం (Election Comission) తాళం వేసింది. ప్రభుత్వ సలహాదారులంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునేవాళ్లు కావడంతో.. వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఈసీ కీలక ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమందికి బిగ్ షాక్ తగిలినట్లైంది.


ఏపీలో ప్రభుత్వ సలహాదారులు పార్టీ వాయిస్ వినిపిస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ వెల్లడించిన విషయం తెలిసిందే. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం... కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


Loksabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ కీలక ఘట్టం

ఈసీ ఆదేశాలతో..

ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీలో సాధారణ పరిపాలన శాఖ చర్యలు ప్రారంభించింది. సలహాదారుల నోటికి తాళం వేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులకు మంత్రులతో సమానంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని తెలిపింది. దీంతో అన్ని శాఖల కార్యదర్శులకు సమాచారం తెలియజేస్తూ సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ యువరాజ్ నోట్ జారీ చేశారు. ఆయా శాఖల కార్యదర్శులకు ఈ విషయం తెలియజేయాలని ఆదేశించారు.


సజ్జల రాజీనామా చేస్తారా..

ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. అలాగే పార్టీ పదవిలోనూ ఆయన కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో రాజకీయపరమైన అంశాలపై మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలను విమర్శిస్తున్నారు. తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయన రాజకీయ విమర్శలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రచారానికి, ప్రసంగాలకు దూరంగా ఉంటారా లేదంటే ఆ పదవికి రాజీనామా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

CM Jagan: తూ.గో. జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 18 , 2024 | 11:55 AM

Advertising
Advertising