ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆర్.కృష్ణయ్య.. ఆఫర్ మామూలుగా లేదుగా..

ABN, Publish Date - Dec 09 , 2024 | 10:02 PM

బీజేపీ కేంద్ర అధిష్ఠానం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్.కృష్ణయ్య చేరుకున్నారు.

R. Krishnaiah

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపించేందుకు బీజీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆర్.కృష్ణయ్య చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం మంగళవారం రోజు వేయనున్న నామినేషన్ పత్రాలపై పలు సంతకాలు చేశారు. ముందుగా రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయనకు బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు.


అనంతరం బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీ మధుకర్‌తో ఆర్.కృష్ణయ్య సమావేశం అయ్యారు. ఆయన సమక్షంలో పార్టీ సభ్యత్వం కృష్ణయ్య స్వీకరించారు. సభ్యత్వానికి సంబంధించిన రశీదును ఆయనకు మధుకర్‌ అందజేశారు. అనంతరం రేపు వేసే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. కాగా, వైసీపీ హయాంలో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎంపీగా వెళ్లారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆయన రాజీమానా చేశారు. దీంతో బేజేపీ తమ పార్టీ తరఫున ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏపీలో మెుత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వగా.. పొత్తులో భాగంగా రెండు టీడీపీ, ఒకటి బీజేపీ వచ్చాయి. అయితే టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీశ్‌ను రాజ్యసభకు పంపేందుకు అధిష్ఠానం నిర్ణయించింది.


ఈ సందర్భంగా తన సేవలు గుర్తించి అవకాశం కల్పించిన బీజేపీ అధిష్ఠానానికి ఆర్.కృష్ణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలు, పేదలు, బీదల అభ్యన్నతి కోసం ఏళ్లుగా తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. తన కృషిని గుర్తించి బీజేపీ అధిష్ఠానం, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా, పార్టీ పెద్దలు తనను రాజ్యసభకు పంపించాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యసభకు వెళ్లినా నిరంతరం బీసీల అభివృద్ధి దిశగా పనిచేస్తానని ఆయన చెప్పారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.


కాగా, ఆర్.కృష్ణయ్య అనేక బీసీ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ తరఫున హైదరాబాద్ ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజయం కేతనం ఎగరవేశారు. ఆ తర్వాత అనేక ఉద్యమాలు నడిపి గత వైసీపీ హయాంలో రాజ్యసభకు వెళ్లారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈసారి బీజేపీ తరఫున ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు వెళ్లనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Vijayawada: చంపేస్తాం.. పవన్ కళ్యాణ్‌కు బెదిరింపు కాల్.. రంగంలోకి స్పెషల్ టీమ్స్

AP Politics: ఏపీ మంత్రి మండలిలోకి నాగబాబు.. టీడీపీ రాజ్యసభ సభ్యులు వీళ్లే..

Updated Date - Dec 09 , 2024 | 10:12 PM