ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lanka Dinakar: భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన

ABN, Publish Date - Jul 17 , 2024 | 12:32 PM

Andhrapradesh: వైసీపీ పాలనలో భూ ఆక్రమణలు , కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలను తెలియజేసిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. వైసీపీ నాయకులు మూడు రాజధానులని మభ్య పెట్టి మూడు ప్రాంతాలలో అన్ని రకాల భూముల దోపిడీ చేశారని ఆరోపించారు.

BJP Leader Lanka Dinakar

విజయవాడ, జూలై 17: వైసీపీ (YSRCP)పాలనలో భూ ఆక్రమణలు , కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలను తెలియజేసిందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ (BJP Leader Lanka Dinakar) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. వైసీపీ నాయకులు మూడు రాజధానులని మభ్య పెట్టి మూడు ప్రాంతాలలో అన్ని రకాల భూముల దోపిడీ చేశారని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రభుత్వ, అటవీ, దేవాలయ మరియు ప్రజల స్వార్జిత భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయన్నారు. నీతి అయోగ్ డ్రాఫ్ట్ సూచనలను పక్కదోవ పట్టిస్తూ జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారన్నారు. ప్రజల, ప్రభుత్వ భూముల రక్షణ కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనను ఆహ్వానిస్తున్నాన్నారు.

AP Tourism: తిరుమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజ్


రికార్డులన్నీ తారుమారు...

వైసీపీ పాలనలో లక్షల ఎకరాల పేదల డీకే భూముల దోపిడీకి తెరలేపారని.. దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. చుక్కల భూములు 22ఏ క్రింద చూపుతూ వాస్తవ యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్య పరిష్కారం సత్వరం అవసరమన్నారు. చుక్కల భూముల సమస్య ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు చాల ఎక్కువ ఉందని తెలిపారు. గత అయిదు సంవత్సరాలలో రాష్ట్రంలో వేలది ఎకరాలకుపైగా దేవాలయాల భూముల రికార్డులు తారుమారు చేశారని చెప్పారు. సింహాచలం దేవాలయ భూములను అన్యాక్రాంతం చేశారన్నారు. సింహాచలం దేవాలయ గెస్ట్ హౌస్‌లో తమిళనాడు నుంచి వచ్చిన కార్తీక్ సుందర రాజన్ అనే వ్యక్తి దేవాలయల భూముల రికార్డులను తారుమారు చేసిన ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అన్నవరం, ఇంద్రకీలాద్రి దేవాలయాల భూముల అక్రమణ, కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని ఉన్నాయన్నారు. తిరుపతిలోని హాదిరాం మఠం భూములు గందరగోళం అయ్యాయని బీజేపీ నేత వెల్లడించారు.

Tomato: పెరిగిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే..


ఆ ఘనత జగన్‌దే...

రాష్ట్రంలో ప్రతి దేవాలయం భూముల రికార్డులను పరిశీలించి కబ్జాలకు గురైన, అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తేవాల్సి ఉందన్నారు. పేదలకు ఇండ్ల పట్టాలని రాజమండ్రి ఆవ భూములు, కాకినాడ మడ అడవుల అక్రమాలు మాదిరిగానే రాష్ట్రం మొత్తం జరిగిన వైసీపీ అవినీతి చిట్టా బయట పెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. నాడు వైసీపీ ప్రజాప్రతినిధులు బెదిరింపులతో విశాఖపట్నంలో భూముల డెవలప్మెంట్ అగ్రిమెంట్లపైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోస్తాలో ఒంగోలులో దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, విజయవాడ, గుంటూరులో పైవేట్ ఆస్తులు కబ్జాలు, నెల్లూరులో క్వాట్జ్, సిల్లికా సంపదను దోచేశారని తెలిపారు. రాయలసీమలో ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు అస్మదీయులకు జగన్ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


గత అయిదు సంవత్సరాలుగా ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ క్వారీలను చిన్నాభిన్నం చేశారన్నారు. జగన్ స్వంత జిల్లా కడపలో లో బెరైటీస్, సున్నపు రాయి త్రవ్వకాల అక్రమాలు ఆకాశాన్ని తాకాయన్నారు. సహజ వనరులతో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని పక్కన పెట్టి అనుయాయులకు సర్వ సంతర్పణ చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ ఆఫీసుల కోసమని జిల్లాకొక ప్యాలెస్ నిర్మాణం కోసం అక్రమ భూ కేటాయింపులు చేసి దేశంలో రాజకీయ పార్టీ ఆఫీసుల నిర్మాణంలో అవినీతి రికార్డు సృష్టించిన జగన్.. వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడం తప్పు కాదు, ప్రభుత్వ భూములను కేటాయించిన తీరు చూస్తే రాచరిక విధానం ప్రతిబింబిస్తుందని లంకా దినకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Andhra Pradesh: పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. కలెక్టర్ కీలక ఆదేశాలు..

Hyderabad: జాతీయ రహదారిపై ఉప్పల్‌ వద్ద కుంగిన రోడ్డు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2024 | 12:46 PM

Advertising
Advertising
<