ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది: యామిని శర్మ..

ABN, Publish Date - Dec 22 , 2024 | 03:03 PM

భారతదేశాన్ని ఎప్పుడూ తామే పాలించాలని కాంగ్రెస్ చూస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ ప్రశ్నించారు. భారతదేశం ఆక్రమణకు గురైంది కాంగ్రెస్ పాలన వల్ల కాదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు.

BJP spokesperson Yamini Sharma

విజయవాడ: 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో ఎప్పుడూ చూడనటువంటి దారుణాలను పార్లమెంట్‌(Parliament)లో చూశామని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ (Yamini Sharma) అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) వీడియో పేరుతో బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా మాటలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటనను తాను ఖండిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ చెప్పారు.


భారతదేశాన్ని ఎప్పుడూ తామే పాలించాలని కాంగ్రెస్ చూస్తోందని, అసలు ఆ పార్టీ వ్యవస్థాపకులు విదేశీయులు కాదా? అంటూ యామిని ప్రశ్నించారు. భారతదేశం ఆక్రమణకు గురైంది కాంగ్రెస్ పాలన వల్ల కాదా? అంటూ ధ్వజమెత్తారు. ససతాన ధర్మం అంటే రాహుల్ గాంధీకి అర్థం తెలుసా?, రాజ్యాంగ వ్యతిరేకులుగా గాంధీ కుటుంబం తయారైందని యామిని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ అంబేడ్కర్‌, పేదల పథకాలకు గాంధీ కుటుంబం వ్యతిరేకమంటూ ఆమె మండిపడ్డారు. అధికారం హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నారని, గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్‌ను అవమానిస్తూనే ఉందని ఆమె ఆరోపించారు. అంబేడ్కర్‌ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ నేతలు కాదా? యామిని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఆయన విగ్రహం ఏర్పాటుకూ కాంగ్రెస్ సహకరించలేదని ఆమె మండిపడ్డారు. దేశ విద్రోహ శక్తులుగా రాహుల్, ప్రియాంక గాంధీ తయారయ్యారని ధ్వజమెత్తారు యామిని.


మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌ను రాజీనామా చేయించింది అప్పటి కాంగ్రెస్ పెద్దలే కాదా అంటూ బీజేపీ అధికార ప్రతినిధి మండిపడ్డారు. అంబేడ్కర్ ఆశయాలను పాటించేది బీజేపీ మాత్రమేనని, అసలు రిజర్వేషన్ల అర్థం ఏంటో రాహుల్ గాంధీకి తెలుసా? అంటూ నిప్పులు చెరిగారు. సిక్కులను ఊచకోత కోసింది, దేశంలో ఎమర్జెన్సీ విధించింది ఇందిరా గాంధీ అనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. ఓబీసీ రిజర్వేషన్లను రాహుల్ గాంధీ వ్యతిరేకించిన మాట వాస్తవం కాదా? అంటూ యామిని ఆరోపించారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు పార్లమెంట్‌కు బీజేపీ తెచ్చిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని ఆమె మండిపడ్డారు. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు ధ్వజమెత్తారు. సాటి మహిళా ఎంపీని రాహుల్ తూలనాడడం మహిళా నేతగా ఖండిస్తున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

TTD: భక్తులకు అలర్ట్... టీటీడీ కీలక నిర్ణయాలు

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా గూడూరు, నెల్లూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు..

Updated Date - Dec 22 , 2024 | 03:05 PM