Share News

RIP Zakir Hussain: మహోన్నత వ్యక్తి జాకీర్ హుస్సేన్‌ను కోల్పోవడం బాధాకరం..

ABN , Publish Date - Dec 16 , 2024 | 07:26 AM

ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్‌ పురస్కారగ్రహీత.. ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73) (Zakir Hussain) ఇకలేరు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు.

RIP Zakir Hussain: మహోన్నత వ్యక్తి జాకీర్ హుస్సేన్‌ను  కోల్పోవడం బాధాకరం..
CM Chandrababu Naidu

అమరావతి: ప్రముఖ తబలా విద్వాంసులు, స్వరకర్త జాకీర్ హుస్సేన్ (Zakir Hussain) మృతి (Death)పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu), మంత్రులు లోకేష్ (Lokesh), కందుల దుర్గేష్ (Kandula Durgesh) సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో మహోన్నత వ్యక్తి అయిన తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్‌కు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రజలను మంత్రముగ్ధులను చేసే ఆయన ప్రదర్శనలు సంగీత ప్రియులను ప్రేరేపించాయని, అతని వారసత్వం సంగీత ప్రపంచాన్ని ప్రేరేపించేలా.. ప్రభావితం చేస్తూనే ఉండాలని సీఎం చంద్రబాబు ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.


మంత్రి నారా లోకేష్ సంతాపం..

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో ఆయన అద్భుతమైన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించిందని, ఒక అద్భుతమైన లెజెండ్‌ను కోల్పోయిందన్నారు. ఈ సంగీత మేధావిని కోల్పోయినందుకు తాను లక్షలాది మంది అభిమానులతో కలిసి సంతాపం తెలియజేస్తున్నానని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


మంత్రి కందుల దుర్గేష్ సంతాపం..

kandula.jpg

ప్రముఖ తబలా విద్వాంసులు, స్వరకర్త జాకీర్ హుస్సేన్ మృతిపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు. ఆరు దశాబ్దాలపాటు సంగీత ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్న జాకీర్‌ హుస్సేన్‌‌ను కోల్పోవడం బాధాకరమన్నారు. జాకీర్ హుస్సేన్ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి పలు అవార్డులను పొందారని పేర్కొన్నారు. హిందుస్థాని క్లాసికల్ మ్యూజిక్, జార్జ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి ప్రతిభా శీలి జాకీర్ హుస్సేన్ అని మంత్రి కొనియాడారు. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు.

కాగా ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.. పద్మవిభూషణ్‌ పురస్కారగ్రహీత.. ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73) (Zakir Hussain) ఇకలేరు. అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇన్నాళ్లు సంగీత ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్న జాకీర్‌ హుస్సేన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు: నాడు, నేడు, రేపు..

ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 16 , 2024 | 09:10 AM