Share News

Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..

ABN , Publish Date - Sep 10 , 2024 | 01:30 PM

నాయకుడి యొక్క గొప్పతనం, పనితనం విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తాయి. అంతా బాగున్నప్పుడు ఎవరైనా చేయగలరు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి.. వారి కష్టాల్లో భాగస్వామ్యం..

Chandrababu vs Jagan: ప్రజలతో చంద్రబాబు.. ప్యాలెస్‌లో జగన్..
Chandrababu

నాయకుడి యొక్క గొప్పతనం, పనితనం విపత్తులు, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తాయి. అంతా బాగున్నప్పుడు ఎవరైనా చేయగలరు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలిచి.. వారి కష్టాల్లో భాగస్వామ్యం అయినప్పుడే నాయకుడి లక్షణాలు బయటపడతాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నో సందర్భాల్లో విపత్తులు వచ్చినప్పుడు సకాలంలో స్పందించి.. ప్రజలకు ఏ విధంగా భరోసాగా నిలిచారో రాష్ట్ర ప్రజలు చూశారు. ఆయనకు ఉన్న పాలన అనుభవంతో ఎలాంటి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కొవడం కొన్ని దశాబ్ధాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి ప్రజలను విపత్తు నుంచి ఎలా గట్టేక్కించాలో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆ అనుభవంతోనే ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల సమయంలో చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుపై రాష్ట్ర ప్రజానీకం ప్రశంసలు కురిపిస్తోంది. మోకాల్లోతు నీటిలో నడుచుకుంటూ మీకు తోడుగా ప్రభుత్వం ఉందంటూ భరోసా ఇచ్చారు. ఈ భరోసా కారణంగానే ప్రజలు భారీ విపత్తును సమర్థంగా ఎదుర్కొన్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా నియంత్రించగలిగారు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, ఆహార పదార్థాలను సకాలంలో అందించడం కోసం చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవ ఎనలేనిది. గత ఐదేళ్ల జగన్ పాలనను చూసిన తర్వాత.. విపత్తుల సమయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును చూసిన పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ వైసీపీ అధ్యక్షులు జగన్ మాత్రం వరదల్లోనూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ స్వార్థ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు.. వారి అవసరాలను ఆసరగా చేసుకుని ప్రభుత్వంపై ప్రజలను రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందనే విమర్శలు లేకపోలేదు.

Rain Alert: వరద సహాయక చర్యల్లో మంత్రి నారాయణ


ప్రజలతో చంద్రబాబు..

వరదలు విజయవాడను ముంచెత్తాయి. గత 50 ఏళ్లలో ఇలాంటి విపత్తును విజయవాడ ప్రజలు ఎప్పుడూ చూడలేదు. వరదలు వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వ మొత్తం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రాణనష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంది. భారం మొత్తం అధికారుల మీద వేయకుండా.. నేరుగా చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రివర్గం మొత్తం సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి రోజు ప్రజల్లోనే ఉంటూ వారి కష్ట, సుఖాలను తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడితో వదిలిపెట్టలేదు.. మంత్రులకు బాధ్యతలు అప్పగించి.. వారిని ఎప్పటికప్పుడు ఫాలోప్ చేస్తూ ముందుకు సాగారు. ఈ విపత్తు సమయంలో చంద్రబాబు సీఎంగా ఉండటంతోనే భారీ ప్రాణ నస్టాన్ని నివారించగలిగారని రాష్ట్రప్రజలు చెప్పుకుంటున్నారు. భారీ విపత్తును సమర్థంగా ఎదుర్కొన్న ప్రభుత్వంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తుంటే.. వైసీపీ అధ్యక్షులు జగన్ మాత్రం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఉత్తరాంధ్రలో కుంభవృష్ఠి


ప్యాలెస్‌లో జగన్..

బాధ్యతాయుతమైన విపక్ష పార్టీగా రాజకీయాలకు అతీతంగా వరదల సమయంలో ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన జగన్.. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి రెండు రోజులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి.. అక్కడి ప్రజలను పరామర్శించినట్లు ఫోటోలకు ఫోజులిచ్చిన జగన్.. ఆ తర్వాత తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితమయ్యారు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా, కొందరు నాయకుల ద్వారా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారా.. లేదంటే ఇదే వైఖరితో ముందుకెళ్తారా అనే దానిని బట్టి వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.


కష్టం.. నష్టం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Sep 10 , 2024 | 01:30 PM