ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: విశాఖ డ్రగ్స్‌ కేసులో ఉన్నది వైసీపీ నేతలే.. ఆధారాలతో బయటపెట్టిన చంద్రబాబు!

ABN, Publish Date - Mar 23 , 2024 | 12:18 PM

విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.

Chandrababu

విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలున్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. విజయవాడ టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీల్లో జగన్, వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని.. దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు.

డ్రగ్స్ కేసులో వైసీపీ నేతలు..

ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గతంలో కాకినాడ ఎమ్మెల్యే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే.. ఆ కేసులో ఇప్పటిరవకు ఎటువంటి పురోగతి లేదన్నారు. వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. డ్రగ్స్ మాఫియా నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవల్సిన అవసరం ప్రజలపైనే ఉందన్నారు. డ్రగ్స్‌పై సీఎం జగన్ ఒక్కసారైనా సమీక్ష చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 12:35 PM

Advertising
Advertising