ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: సహాయకచర్యలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ABN, Publish Date - Sep 07 , 2024 | 10:31 PM

అత్యంత క్లిష్టమైన బుడమేరు బ్రీచ్‎లను పూడ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగు రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్‎లు కలిసి దీన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. దీనివల్ల ఇన్ ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు.

విజయవాడ: అత్యంత క్లిష్టమైన బుడమేరు బ్రీచ్‎లను పూడ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగు రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్‎లు కలిసి దీన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. దీనివల్ల ఇన్ ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు.. ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పును సరిచేయడానికి హెవీ టాస్క్ అయిందని అన్నారు. జగన్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు‎లను మెయింటెయినెన్స్ సరిగా చేయలేదని ఆరోపించారు. అన్నమయ్య, గుండ్లకమ్మ, పులిచింతల కొట్టుకుపోయినా ఒక్క పైసా మెయింటెయినెన్స్‎కు ఇవ్వలేదని మండిపడ్డారు. బుడమేరు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురైందని తెలిపారు. గతంలో డ్రైన్ వాటర్ స్ట్రోమ్ కోసం రూ. 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు..


ఆ నిధుల్లో గత టీడీపీ ప్రభుత్వంలో రూ. 100 కోట్లు ఖర్చుపెట్టామని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ నిధులను ఏమి ఖర్చు పెట్టలేదని .. ఆనిధులను డైవర్ట్ చేసిందని ఆరోపణలు చేశారు. 7 రోజుల పాటు చాలా ప్రాంతాలు నీళ్లలోనే ఉన్నాయన్నారు. ఈ రోజు న్యూ రాజరాజేశ్వరి పేటలో బాధితులను పరామర్శించానని తెలిపారు. ఇప్పటికీ 4 అడుగుల నీళ్లు ఉన్నాయని . ఈ ప్రభుత్వంపై బాధ్యత ఉందని తెలిపారు. బుడమేరు క్లోజ్ చేసేటప్పటికి 1.1 టీఎంసీల నీళ్లు విజయవాడలో ఉన్నాయని అన్నారు. ఈరోజు కురిసిన భారీ వర్షాల వల్ల మళ్లీ నీరు వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు.


యూరోపియన్ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బుడమేరు ప్రాంతంలో రేపు .38 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విజయవాడకి .09 టీఎంసీల నీరు వస్తాయని నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. ఐఎండీ అధికారులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం బుడమేరులో 1.86 టీఎంసీల నీరు వ చ్చే అవకాశం ఉందని అన్నారు. విజయవాడ నగరానికి .38 టీఎంసీల నీళ్లు వస్తాయని నివేదికలో తెలిపారని అన్నారు. ఈ సమస్య ఇంకా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.


భారీ వర్షాల వల్ల రూ. 6,880 కోట్లు నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ రోజు కొంతమంది వద్దని చెప్పినా తమ సర్వే ప్రకారం కేంద్రానికి నివేదిక పంపించామని తెలిపారు. 66వేల 654 మంది బాధితులకు ప్రభుత్వం సాయం చేసిందని తెలిపారు. ఫుడ్ సప్లై విషయంలో ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టుకుని నిలదీయాలని అన్నారు. 12, 197 హౌస్ వాటర్ కనెక్షన్లు తీసుకోవాలని చెప్పారు. ఫైర్ డిపార్ట్‎మెంట్ ఇప్పటికీ పనులు కొనసాగిస్తోందని తెలిపారు. శానిటేషన్‎లో 78 శాతం శుభ్రం చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

కరెంట్ షాక్ వస్తుండటంతో మిగిలిన పనులకు కొంత విరామం ఇచ్చినట్లు చెప్పారు. ఇంటింటికీ సరుకులు కావాలని 75 శాతం కోరుతున్నారని అన్నారు. భారీ వర్షాలతో 26 మంది చనిపోయారని.. ఇద్దరు మిస్సింగ్ అయ్యారని చెప్పారు. భారీ వర్షాలపై కొన్ని సర్వేల ద్వారా ప్రజాభిప్రాయం తీసుకున్నామని అన్నారు. శానిటేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రూరల్ ఏరియాలో కొంత బెటర్‎గా పని చేసినట్లు సీఎం చంద్రబాబు వివరించారు.


సహాయక చర్యలపై అర్బన్ కంపెనీని అప్రోచ్ అయ్యామని తెలిపారు. బాధితులకు ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి చూస్తామని హామీ ఇచ్చారు. వ ర్షాల వల్ల రూ. 2లక్షలు ఇళ్లు దెబ్బ తిన్నాయని.. మొదటి అంతస్తు వరకు దెబ్బతిన్నవి లక్ష 40 వేలు ఉన్నాయని చెప్పారు. వార్డ్ నెంబర్ 45లో కొవెల్ ఫ్లాట్ ఓనర్స్ 2 లక్షలు 50 వేలు ఇచ్చారని అన్నారు. బాధితులు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. కావాలని వరద సాయంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు.


మొన్న వచ్చిన బోట్స్ ఐరన్ బోట్లు చాలా బలంగా ఢీ కొట్టిందని చెప్పారు. ఆ బోటు ఓనర్ ఫొటో‎లు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. . చరిత్రలో ఏ రాజకీయ పార్టీలు ఇలా విన్యాసాలు చేసే పరిస్థితిలో లేవని తెలిపారు. రేషన్ కార్డు లేని వారికి కూడా రేషన్ ఇస్తాం, ఫింగర్ ప్రింట్, ఐరిష్ తీసుకుంటామని వివరించారు. ఏపీకి రోటీన్ గా వచ్చే నిధులను కేంద్రం నుంచి వరద సాయం కోసం వచ్చినట్టు చెబుతున్నారని అన్నారు. ఓడిపోయిన దగ్గరి నుంచి ఏపీని నాశనం చేయడానికి తమపై జగన్ పేపర్, టీవీలో విషం చిమ్ముతున్మారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీస్‎పై దాడి చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలని అన్నారు. తిరిగి తమ‎ ఆఫీస్ పైనే కేసుల పెట్టారని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 07 , 2024 | 10:40 PM

Advertising
Advertising