CM Chandrababu: జోరు వానలో అర్ధరాత్రి సింగ్ నగర్‌కు సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 02 , 2024 | 07:40 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోరు వానలో ఆదివారం అర్ధరాత్రి సింగ్‌నగర్ వెళ్లారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా సింగ్ నగర్ వెళ్ళానని చెప్పారు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని, కొంతమంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని ఉన్నారని, సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతీ ఒక్కరినీ రక్షించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) జోరు వానలో (Heavy Rains) ఆదివారం అర్ధరాత్రి సింగ్‌నగర్ (Singh Nagar) వెళ్లారు. బాధల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా సింగ్ నగర్ వెళ్ళానని చెప్పారు. బాధితుల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని, కొంతమంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుని ఉన్నారని, సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతీ ఒక్కరినీ రక్షించి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. సోమవారం ఉదయానికల్లా బోట్లు, హెలికాప్టర్ అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వరద నీరు కూడా తగ్గుతుందని భావిస్తున్నానన్నారు. సహాయక చర్యలు మరింత వేగవంతం చేస్తామన్నారు. సోమవారం 6 హెలికాప్టర్‌లు వస్తాయని, సహాయక చర్యల్లో పాల్గొంటాయని చంద్రబాబు వెల్లడించారు.
బుడమేరు బాధితులు కట్టుబట్టలతో బయటకు వస్తున్నారని.. వాళ్లకు దుస్తులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మహిళలకు, పురుషులకు ఏ ఏ దుస్తులు ఇవ్వొచ్చో చూసి ఇవ్వాలన్నారు. మగవారికి లుంగీలు, టీ షర్ట్‌లు, మహిళలకు చీరలు, చుడీదార్‌లు ఇవ్వాలని సూచించారు. మహిళ అధికారులు, నేతలు, మహిళలకు ఏమి కావాలో చూసి ఇవ్వాలన్నారు. వాటితోపాటు దుప్పట్లు కూడా సరఫరా చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
జలదిగ్బంధంలో ఇబ్రహీంపట్నం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. జలదిగ్బంధంలో ఉన్న పెర్రి , జూపూడి, మూలపాడు ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణలంక , ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు స్థానికులతో మాట్లాడారు. అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పారు. అనంతరం మూలపాడుకు ముఖ్యమంత్రి బయలు దేరివెళ్లారు. ఇబ్రహీంపట్నం, మూలపాడు, జూపూడి వద్ద, హైవే మీద వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, కిలేస్ పురం, మూలపాడు కోటికలపూడి, దాములూరు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాటిని పరిశీలించిన చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి.. సహాయ కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు.
తెల్లవారుజాము మూడు గంటల వరకూ వరద ప్రభావిత ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు పర్యటించారు. కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. జూపూడి, మూలపాడులో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో నివాసితులు రోడ్లపైకి వచ్చారు. అర్ధరాత్రి సమయంలో కూడా ముఖ్యమంత్రి బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. అందరికీ ఆహారం, నీళ్ళు సరఫరా చేస్తున్నామని.. ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా 1070 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఎవరూ అధైర్య పడొద్దని... అండగా ఉంటానని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. పరిస్థితులు చక్కదిద్దే వరకు బాధితుల మధ్యనే ఉంటానని ఆయన ప్రకటించారు.
నేరుగా బాధితుల పరామర్శ..
తెల్లవారుజామున 4 గంటల వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేరుగా గృహల్లోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఆదివారం రాత్రి 10. 40 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 4.19 గంటల వరకు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత విజయవాడ సింగ్ నగర్, ఆ తరువాత ఇబ్రహీంపట్నం, ములపాడులో పర్యటించారు. తర్వాత అక్కడినుంచి నేరుగా విజయవాడ కృష్ణలంకలో పర్యటించారు. ప్రకాశం బ్యారేజి వరద 11 లక్షల క్యూసెక్కులకు చేరుకోవడంతో అక్కడి ప్రజలను ధైర్యంగా ఉండాలని చెబుతూ.. అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు వచ్చి బస్సులో బస చేశారు. రెండు గంటలు రెస్ట్ తీసుకుని వస్తానని సెక్యూరిటీ, అధికారులకు చెప్పారు. తన వెంట అధికారులు ఎవరు రావద్దని, అందరూ వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ వర్షాలతో 80 రైళ్ల రద్దు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Sep 02 , 2024 | 07:44 AM