ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు

ABN, Publish Date - Sep 20 , 2024 | 10:54 AM

Andhrapradesh: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు. ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు.

Complaint against former Chief Minister Jagan to Union Home Department

అమరావతి, సెప్టెంబర్ 20: వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ (Tirumala laddu) ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వచ్చిన వార్త ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందిరికీ తెలిసింది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ నేతలు, హిందువులు, స్వామి వారి భక్తులందరూ నాటి జగన్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ విషయానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌పై (Former CM YS Jaganmohan Reddy) కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని మండిపడ్డారు. హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు. ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

AP News : జగన్‌ బేజారు!


ఈ మేరకు కేంద్ర హోం శాఖకు వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగంపై ఆయన స్పందించారు. కేంద్ర హోం శాఖతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు ఈ వ్యవహారంపై న్యాయవాది ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ రెడ్డితో పాటు అప్పటి టీటీడీ పాలక వర్గం, జంతువుల కొవ్వు నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్‌తో పాటు ఇందుకు కారకులైన వారిపై భారత న్యాయ సంహితలోని 152, 192, 196, 298, and 353 సెక్షన్ల కింద వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద కూడా జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Minister Lokesh: చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. వివరాలు ఇవే..


ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నిర్ధారణ..

వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది. జులై 8, 2024న ప్రసాదం శాంపిల్స్‌ని ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ ద్వారా వైసీపీ బండారం బట్టబయలైనట్లైంది. నెయ్యి కొనుగోళ్ళలో ఎటువంటి నాణ్యత పాటించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆధారాలతో సహా నిరూపించారు. దీంతో తాము ఆర్గానిక్ నెయ్యితోనే తాము నైవేద్యాలు, ప్రసాదాలు తయారు చేశామని చెప్పుకొచ్చిన వైసీపీ నేతల మాటలు అన్నీ అబద్దాలే అని ల్యాబ్ నివేదికతో తేలిపోయింది.


ఇవి కూడా చదవండి..

Viral Video: క్లాస్‌లో గొడవ జరుగుతోందని పరుగులు పెట్టిన టీచర్.. లోపలికి వెళ్లాక ఏం జరిగిందో చూస్తే..

Jani Master: నార్సింగ్ పోలీస్ స్టేషన్‌‌లోనే జానీ మాస్టర్.. మరికొద్ది సేపట్లో..


Read Latest AP News ANd Telugu News

Updated Date - Sep 20 , 2024 | 12:37 PM