ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Assembly: టీడీఆర్ బాండ్లపై ఏపీ అసెంబ్లీలో చర్చ...

ABN, Publish Date - Jul 25 , 2024 | 11:56 AM

Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. టీడీఆర్ బాండ్లపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2019 నుండి 24 వరకూ 3306 టీడీఆర్ బాండ్స్ ఇచ్చారని..

Minister Narayana AP Assembly Session

అమరావతి, జూలై 25: ఏపీ అసెంబ్లీ (AP Assembly Session) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పలు సమస్యలపై సభ్యులు అడిగి ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రౌడీయిజంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. అలాగే విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజ్‌లో టాయిలెట్ల షార్టేజ్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించగా... త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

AP Assembly: బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజంపై ఏపీ అసెంబ్లీలో చర్చ



అనంతరం టీడీఆర్ బాండ్లపై తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ (Minister Narayana)సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2019 నుండి 24 వరకూ 3306 టీడీఆర్ బాండ్స్ ఇచ్చారని.. దీనిపై శాఖాపరమైన చర్యలు, ఏసీబీ విచారణకు ఆదేశించామని తెలిపారు. ఏసీబీ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందన్నారు. తణుకులో ముగ్గరు అధికారులను ఈ వ్యవహరంలో సస్పెండ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు.


ఎమ్మెల్యేల ప్రశ్నలివే..

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. టీడీఆర్ బాండ్ల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనేది అందరికీ తెలుసన్నారు. తణుకు పురపాలక సంఘంలో 61 బాండ్లు ఇష్యూ చేశారన్నారు. టీడీపీ హాయంలో 6000 గజాలకు మాత్రమే బాండ్లు ఇచ్చామన్నారు. గతంలో సంవత్సర కాలంలోనే లక్ష, 48వేల 400 గజాలు వరకూ బాండ్లు ఇచ్చారన్నారు. జగనన్న కాలనీ పేరుతో 25 కోట్లకు బాండ్లు ఇష్యూ చేశారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారి ఎవరో తేల్చారా లేక అధికారులపై చర్యలు మాత్రమేనా అని ప్రశ్నించారు. అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహరం నడిచిందన్నారు. ఈ భూములు అన్నీ సంవత్సర కాలంలోనే చేతులు మారాయన్నారు. రిజిష్ట్రేషన్లు చేశారని తెలిపారు. ఈ భూముల పరిస్ధితి తెలియజేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. టీడీఆర్ బాండ్ల విషయంలో సూత్రధారులు పాత్రదారులపై చర్యలు తీసుకోవాలని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య కోరారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు..


ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. విశాఖపట్నంలో మాడిఫికేషన్‌ను ఆసరాగా తీసుకొని రెస్ట్రిక్టడ్ జోన్‌లకు టీడీఆర్ బాండ్లు జారీ చేశారన్నారు. విశాఖపట్నం మెయిన్ రోడ్డు మీద సీబీసీఎన్సీ అనే క్రిష్టియన్ మైనార్టీ సంస్ధ ఉందని... ఈ రోడ్డుకు 60 కోట్ల టీడీఆర్‌లు బాండ్లు ఇష్యూ చేశారన్నారు. ఈ విషయంలో చిన్న బిల్డర్‌లను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలని ఎమ్మెల్యే తెలిపారు.


రిపోర్టు రాగానే యాక్షన్: మంత్రి నారాయణ

దీనిపై మంత్రి నారాయణ సమాధానమిస్తూ... తణుకులో టీడీఆర్ బాండ్లు 29 ఇచ్చారు... 4500 స్క్వే ర్ యార్డు ఉంటే 1.4 కిలోమీర్లు దూరంలో ఉన్న ఇంటిని చూపించి అక్కడి రేటు పెంచారన్నారు. దీంతో దీని విలువ ఎబ్నార్మల్‌గా పెరిగిందన్నారు. 63.24లక్షలకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాల్సి ఉండగా 754 కోట్ల 67 లక్షలు తీసుకున్నారని.. దీనిపై 691కోట్ల 43 లక్షల స్కాం తణుకులో గుర్తించామని చెప్పారు. నాలుగు ప్లేస్‌లలో కంప్లైట్‌లు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఇచ్చిన బాండ్లు కంప్లీట్‌గా రిలీజ్ చేయొద్దని చెప్పానని అన్నారు. రిపోర్టు రాగానే యాక్షన్ తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Polavaram: పోలవరంపై మంత్రివర్గంలో కీలక చర్చ


అందరిపై చర్యలు తీసుకుంటాం: ఎమ్మెల్యే బుచ్చయ్య

రాజమండ్రిలో ఎలాంటి టీడీఆర్‌లు ఇవ్వకుండానే గతంలో రోడ్డు వైడన్ చేశామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఇప్పుడు ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. ఏపీ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్‌లను పిలిచి నిన్న మీటింగ్ పెట్టామని.. దీనిపై పూర్తిస్ధాయి విచారణ చేయిస్తామన్నారు. ఈ వివరాలు అన్నింటి పైనా సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు, మాజీమంత్రులు ఎవ్వరు ఉన్న బాధ్యులు అందరిపై చర్యలు చేపడుతామని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: వైసీపీకి వరుస రాజీనామాలు.. దేనికి సంకేతం..?

USA: భారత్‌లోని ఈ నగరాలకు వెళ్లకూడదు.. అమెరికా హెచ్చరిక

Read Latest AP News And Telangana News

Updated Date - Jul 25 , 2024 | 12:00 PM

Advertising
Advertising
<