Andhrapradesh: అన్నింటిలోనూ అధమస్థానంలో ఏపీ.. ఆర్థికవేత్త చిన్నయసూరి వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 15 , 2024 | 12:14 PM
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితిపై ప్రొఫెసర్, ఆర్థికవేత చిన్నయసూరి సంచలన విషయాలు వెల్లడించారు. అభివృద్ధి అంటే ఉన్నదాన్ని మరింత వృద్ధి చేయడమని.. లేనిదాన్ని సృష్టించటం కాదని తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌లో ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఏం విధానం అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రస్తుతం తలసరి ఆదాయంలో 16వ స్థానంలో ఉందని.. దక్షిణ భారత్‌లో అధమ స్థానంలో ఉందని పేర్కొన్నారు.
అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) అభివృద్ధి, ఆర్థిక పరిస్థితిపై ప్రొఫెసర్, ఆర్థికవేత చిన్నయసూరి (Economist Chinnayasuri) సంచలన విషయాలు వెల్లడించారు. అభివృద్ధి అంటే ఉన్నదాన్ని మరింత వృద్ధి చేయడమని.. లేనిదాన్ని సృష్టించటం కాదని తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారత్‌లో (India) ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఏం విధానం అమలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రస్తుతం తలసరి ఆదాయంలో 16వ స్థానంలో ఉందని.. దక్షిణ భారత్‌లో అధమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. జాతీయ అక్షరాస్యతలోనూ ఆంధ్రప్రదేశ్ అధమ స్థానంలోనే ఉందని చెప్పుకొచ్చారు. ఆరోగ్యం (AP Health) విషయంలోనూ జాతీయ సగటుతో పోలిస్తే ఏపీ కిందే ఉందని అన్నారు. ఏపీలో కేవలం 10 శాతం మంది మాత్రమే పరిశ్రమలు, సేవల రంగంపై ఆధారపడి ఉన్నారని వెల్లడించారు.
Road Accident: అనంతపురంలో దారుణం.. కారుతో ఢీకొని 18 కి.మీ. లాక్కెళ్లిన డ్రైవర్
విశాఖలో ప్రగతిని అడ్డుకుంటుంది వారే..
ఏపీకి రాజధాని కూడా లేదని.. గత వందేళ్లుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. మన ఆంధ్రులకు ఆమోదయోగ్యమైన ప్రాంతం ఎక్కడా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి నమూనా, లక్ష్యం, మార్గం లేకుండా ఏం ప్రగతి సాధించగలమని అడిగారు. 80 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టు నిలిచిపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీకి రాజధాని లేకపోవడం వల్ల పురోగతి నిలిచేలా చేస్తోందని చెప్పుకొచ్చారు. విశాఖను (Visakhapatnam) కూడా అభివృద్ధి చేయలేదన్నారు.
ప్రభుత్వంలో కొందరు పెద్దలు విశాఖలో భూములు ఆక్రమించుకుని ప్రగతిని అడ్డుకున్నట్టు తెలుసుకున్నానన్నారు. అవగాహనారాహిత్యం వల్ల ఏపీలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రభుత్వ ధనంతో సంక్షేమ పథకాల ద్వారా ఓట్ల కోసం డబ్బు పంచడం ఓ అభివృద్ధి నమూనాగా మారిందన్నారు. మెక్సికోలోనూ ప్రజల డబ్బును పంచి ఓట్లు కొనుగోలు చేసుకున్నారని.. అక్కడ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని చిన్నయసూరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
CM Jagan: కేసరపల్లి నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం.. నేటి షెడ్యూల్ ఇదే..
Bonda Uma: గులకరాయి డ్రామాకు ఆ ఇద్దరే సూత్రధారులు
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 15 , 2024 | 12:52 PM