YS Jagan: ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టును ఆశ్రయించిన జగన్
ABN, Publish Date - Jul 23 , 2024 | 04:31 PM
Andhrapradesh: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలని మంగళవారం నాడు హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని అన్నారు. ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు.
అమరావతి, జూలై 23: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) హైకోర్టును (AP Highcourt) ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలని మంగళవారం నాడు హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సభలో ప్రతిపక్షంలో ఎవరు ఎక్కువ సభ్యులు ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని అన్నారు. ఆ పార్టీ నేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్నారు. ఏపీ శాసనసభలో పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్‌లో తెలిపారు. వెంటనే తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలని పిటిషన్‌లో జగన్ కోరారు.
Budget 2024: కేంద్రం సాయంపై సీఎం చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్
కాగా.. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్ ఈసారి ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవిచూశారు. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు. సాధారణంగా ప్రతిపక్ష హోదాకు 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందాల్సి ఉంటుంది. కానీ వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా జగన్ దక్కకుండాపోయింది. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాశారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉండాలని.. ఈ విషయంలో మరోసారి ఆలోచించాలని అన్నారు. ప్రతిపక్ష హోదాకు 10శాతం సీట్లు కావాలని ఎక్కడా లేదని జగన్ లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Sujanachowdary: ఏపీ చరిత్రలో చాలా శుభదినం
CM Chandrababu: వెంటీలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇచ్చారు..
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 23 , 2024 | 04:36 PM