ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: వైసీపీకి వరుస రాజీనామాలు.. దేనికి సంకేతం..?

ABN, Publish Date - Jul 25 , 2024 | 09:24 AM

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. వైసీపీకి కొందరు నేతలు గుడ్‌బై చెబుతున్నారు. జగన్(YS Jagan)పాలన సూపర్ అంటూ ఐదేళ్లపాటు ప్రశంసలు కురిపించిన నేతలు ఇప్పుడు జగన్‌కు దూరమవుతున్నారు.

YSRCP

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. వైసీపీకి కొందరు నేతలు గుడ్‌బై చెబుతున్నారు. జగన్(YS Jagan)పాలన సూపర్ అంటూ ఐదేళ్లపాటు ప్రశంసలు కురిపించిన నేతలు ఇప్పుడు జగన్‌కు దూరమవుతున్నారు. పార్టీపై నేరుగా విమర్శలు చేయకపోయినా సరే.. వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా రెండు రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపి(YSRCP)కి రాజీనామా చేశారు. ఇప్పటికిప్పుడు ఆ ఇద్దరు నేతలు వేరే పార్టీలో చేరకపోయినప్పటికీ.. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలోనే ఉంటే తమకు పొలిటికల్ కేరీర్ ఉండదనే ఉద్దేశంలో కొందరు నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరేందుకు ఎందరో వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ .. ఆ పార్టీల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతోనే వైసీపీలో కొనసాగుతూ వస్తున్నారనే చర్చ జరుగుతోంది.

Chandrababu : కిక్కు లెక్క తేలుస్తాం


జగన్‌కు షాక్..

పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సైతం జగన్‌కు గుడ్‌బై చెప్పారు. వీరిద్దరిలో రోశయ్యకు జగన్ గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ కేటాయించారు. మద్దాలి గిరిధర్‌కు టికెట్ ఇవ్వలేదు. ప్రభుత్వం వస్తే ప్రాధాన్యత ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో గిరిధర్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన గిరిధర్.. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు. గతంలో జగన్ నిర్ణయాలను ఈ ఇద్దరు నేతలు స్వాగతించారు. ప్రస్తుతం ఆ నేతలే జగన్‌పై విశ్వాసం లేకపోవడంతో పార్టీ వీడారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి వైసీపీ నేతలు జగన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

ఢిల్లీ వీధుల్లో జగన్‌ ధర్నా


భవిష్యత్తు కోసమేనా..

కిలారి రోశయ్య, మద్దాలి గిరిధర్ ఇద్దరూ వ్యాపారవేత్తలు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేకపోవడంతో తాము అదే పార్టీలో ఉంటే ఏవైనా ఇబ్బందులు ఎదురవ్వొచ్చని.. రాజీనామా చేస్తే తమను ఇతర పార్టీలు పెద్దగా టార్గెట్ చేయవనే ఆలోచనతోనే పార్టీ మారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు త్వరలోనే రెండు వేర్వేరు పార్టీల్లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మద్దాలి గిరి టీడీపీలో, కిలారి రోశయ్య జనససేనలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కిలారి రోశయ్య రాజీనామా సందర్భంగా వైసీపీపై పలు విమర్శలు చేశారు. పార్టీలో తనకు కనీస గౌరవం దక్కలేదని.. పార్టీని మోసం చేసిన వ్యక్తులను చేరదీసి వైసీపీ అధినేత జగన్ గౌరవించారని రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుడు మాటలు విపి జగన్ తనకు పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఆదేవన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్‌’

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra pradesh News and Latest Telugu News

Updated Date - Jul 25 , 2024 | 10:31 AM

Advertising
Advertising
<