Boiler Explosion: వరస బాయిలర్ పేలుడు ఘటనలతో దద్దరిల్లుతున్న ఎన్టీఆర్ జిల్లా..
ABN, Publish Date - Jul 09 , 2024 | 09:16 AM
వరస బాయిలర్ పేలుడు(Boiler Explosion) ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా(NTR District) దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవకముందే ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) ఐదవ యూనిట్ బాయిలర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఎన్టీఆర్: వరస బాయిలర్ పేలుడు(Boiler Explosion) ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా(NTR District) దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవక ముందే ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో మరో ప్రమాదం వెలుగు చూసింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (NTTPS) ఐదవ యూనిట్ బాయిలర్‌లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గొల్లపూడి ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు.
జులై 7వ తేదీన బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలోనూ బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా.. మరో 16మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. బాధితులంతా ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికులు. బాయిలర్ నిర్వహణలో అల్ట్రాటెక్ కర్మాగారం విఫలమవ్వడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇబ్రహీంపట్నం ఎన్టీటీటీపీఎస్‌లో బాయిలర్ నుంచి మంటలు రావడం, ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో కార్మికుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన బాయిలర్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా, కార్మికుల ప్రాణాలను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
Crime News: కూతురు పుట్టిన గంటల వ్యవధిలోనే తండ్రి హత్య.. మరీ ఇంత దారుణమా?
Updated Date - Jul 09 , 2024 | 09:22 AM