ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budameru Works: బుడమేరు కట్ట పటిష్ఠతకు అధికార యంత్రాంగం చర్యలు..

ABN, Publish Date - Sep 08 , 2024 | 12:04 PM

బంగాళాఖాతంలో మరోసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

అమరావతి: బంగాళాఖాతంలో మరోసారి ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇప్పటికే వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పది రోజులుగా బుడమేరు పొంగిపొర్లి విజయవాగ నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామో అంటూ నిన్నటి వరకూ కాలం వెల్లదీశారు. అయితే ఏపీ ప్రభుత్వం ఎంతో కష్టపడి బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చివేసింది.


పులివాగుకు వరద..

అయితే మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉండడంతో బుడమేరు కట్టను పటిష్ఠం చేసేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం బుడమేరుకు 15వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చినా తట్టుకునేలా కట్టను పటిష్ఠం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను మంత్రి నిమ్మల దగ్గరుండి మరీ చేయిస్తున్నారు. భారీ వర్షాలు, పులివాగు నుంచి బుడమేరుకు మరింత వరద వస్తున్న నేపథ్యంలో నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. జోరు వానలోనూ మంత్రి పనులు ముమ్మరంగా చేయిస్తున్నారు. గండి పూడ్చిన ప్రాంతంలో రాళ్ల కింద నుంచి వస్తున్న నీటిని ఏ విధంగా ఆపాలన్న దానిపై మంత్రి దృష్టి సారించారు. పూడ్చిన గండ్లపై రెండో లేయర్ వేయడంతో కట్ట మరో మూడు అడుగులు మేర ఎత్తు పెరిగింది.


వాటర్ లీక్..

మరోవైపు బుడమేరు వద్ద గండి పూడ్చిన ప్రాంతంలో రాళ్ల కింద నుంచి సుమారు 500క్యూసెక్కుల నీరు లీక్ అవుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ వరద మెుత్తం విజయవాడ వైపు వెళ్తోందని, దాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. పులివాగుకు వరద భారీగా పెరిగిందని, అది బుడమేరులో కలుస్తోందని వెల్లడించారు. నిన్న(శనివారం)తో పోలిస్తే బుడమేరు వరద ప్రవాహం కొంతమేర పెరిగిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి 2,500క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోందని, యుద్ధ ప్రతిపాదికన కట్టకు మూడో లేయర్ వేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పనులు పూర్తయితే బుడమేరుకు 10వేల క్యూసెక్కుల వరద వచ్చినా ముప్పు ఉండదని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. బుడమేరు కుడి పక్క బండ్స్‌కు ఏడుచోట్ల గండ్లు పడ్డాయని, ఇప్పటికే ఒక దాన్ని పూడ్చామని, మిగిలిన వాటి పనులూ జరుగుతున్నట్లు వెల్లడించారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం 35వేల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేసే విధంగా బీడీసీ ఛానల్‌ని డిజైన్ చేయడమే అని ఎమ్మెల్యే చెప్పారు. బుడమేరు ప్రాంతంలో ఉండే చెరువులు పూర్తిస్థాయిలో నిండాయని, అవి తెగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.


12గంటల్లోనే ఇళ్లు శుభ్రం..

బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. బురద తొలగింపు, శానిటేషన్,‌ క్లోరినేషన్ పనులను మంత్రి పరిశీలించారు. వరదనీరు ఇంటి నుంచి బయటకి వెళ్లిన 12గంటల్లోనే ఆ ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తున్నట్లు నారాయణ చెప్పుకొచ్చారు. వరదలు వచ్చిన మెుదట్లో 12‌లక్షల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశామని, ప్రస్తుతం 4లక్షల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికీ ఆహారం అందేలా చేస్తున్నట్లు తెలిపారు. బుడమేరుకు పడిన గండ్లు పూర్తిగా పూడ్చివేశారని, కట్ట ఎత్తు ఇంకా పెంచాలని నిర్ణయించి పనులు ముమ్మరంగా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బుడమేరు వరద నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించే విధంగా కట్ట పటిష్ఠంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. టెన్షన్.. టెన్షన్

Minister Nimmala: మంత్రి నిమ్మలను అభినందించిన సీఎం చంద్రబాబు..

Rain Alert: ఆ మూడు జిల్లాలను వణికిస్తున్న వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్లు..

Student Murder: అనంతపురం జిల్లాలో డిగ్రీ విద్యార్థిని హత్య కలకలం..

Updated Date - Sep 08 , 2024 | 12:22 PM

Advertising
Advertising