Kesineni Chinni: టీడీపీ- జనసేన కూటమికి 160 సీట్లు రావడం ఖాయం
ABN, Publish Date - Mar 04 , 2024 | 10:40 PM
వైసీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి ఏం జరగడం లేదని.. అక్రమాలు, అన్యాయాలు పెరిగిపోతున్నాయని కేశినేని చిన్ని(శివనాథ్)(Kesineni Chinni) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని కేసినేని నాని నిజం ఒప్పుకున్నాడన్నారు.
ఎన్టీఆర్ జిల్లా (నందిగామ): వైసీపీ పాలనలో ఏపీలో అభివృద్ధి ఏం జరగడం లేదని.. అక్రమాలు, అన్యాయాలు పెరిగిపోతున్నాయని కేశినేని చిన్ని(శివనాథ్)(Kesineni Chinni) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని కేసినేని నాని నిజం ఒప్పుకున్నాడన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయలేని పార్టీలోకి కేశినేని నాని ఎందుకు చేరారని ప్రశ్నించారు. నాని అజ్ఞాని కాబట్టే ఆ పార్టీలోకి చేరారని విమర్శించారు. రాష్ట్రంలోని నానీలందరికి చిప్పులు పోయాయని ఎద్దేవా చేశారు. కళ్లు తాగే అలవాటు వాళ్లకే ఉందని అందుకనే కళ్లు తాగిన కోతిళ్లా వాగుతున్నారని విమర్శించారు.
నీతి నిజాయితీ గల వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని జగన్ సంతృప్తి పరచడానికి మాట్లాడుతున్నారని అన్నారు. ‘కొడాలి నాని నువ్వు క్యాసీనో ఆడుకో, ఈ దొంగ పనులన్నీ మానుకో నీ పని నువ్వు చూసుకో’ అని దెప్పిపొడిచారు. అధికారంలో ఉండి ఆయన ఏ పనులు చేశాడో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోతున్నాడని చెప్పారు. సచివాలయాలను గత టీడీపీ ప్రభుత్వంలో కడితే వీళ్లు తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని అంటున్నారని.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు పార్టీ మారుతున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది జనసేన, టీడీపీ ప్రభుత్వమేనని.. 160 సీట్లు పైబడి గెలుచుకుంటుందని కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - Mar 04 , 2024 | 10:40 PM