ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: నూజివీడు ట్రిపుల్ ఐటీపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ABN, Publish Date - Sep 14 , 2024 | 10:35 PM

నూజివీడులోని ట్రిఫుల్‌ ఐటీ క్యాంపస్ వ్యవహారాల పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వివిధ ఆరోపణలపై ట్రిపుల్ ఐటీలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అమరావతి: నూజివీడులోని ట్రిఫుల్‌ ఐటీ క్యాంపస్ వ్యవహారాల పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వివిధ ఆరోపణలపై ట్రిపుల్ ఐటీలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


ఈ నేపథ్యంలో రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ డైరెక్టర్‌ను తొలగించింది. కళాశాల విద్యా కమిషనర్ చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జి చైర్మన్ సభ్య కార్యదర్శిగా, ఏలూరు జిల్లా కలెక్టర్ సభ్యురాలిగా త్రిసభ్య కమిటీ నియమించింది.


ట్రిపుల్ ఐటీలో ఆహార నాణ్యత, శానిటేషన్ , విద్యార్ధుల హాస్టళ్లలో పరిశుభ్రత, లైంగిక వేధింపుల లాంటి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని త్రిసభ్య కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్యాంపస్‌లో డ్రగ్స్, ధూమపానం అరికట్టేలా కఠిన చర్యలు చేపట్టాలని కమిటీకి సూచనలు జారీ చేసింది. క్యాంపస్‌లో జరిగే ప్రతికూలమైన ఘటనలను తక్షణం ప్రభుత్వ దృష్టికి తేవాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రిపుల్ ఐటీ నూజివీడు క్యాంపస్‌లో జరుగుతున్న వ్యవహారాలపై సెప్టెంబరు 20 తేదీలోగా నివేదిక ఇవ్వాలని త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Sep 14 , 2024 | 10:37 PM

Advertising
Advertising