ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: జగన్‌కు దూరమవుతున్న నాయకులు.. ఇప్పటికైనా తీరు మారుతుందా..!

ABN, Publish Date - Jul 28 , 2024 | 10:55 AM

బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వాలతాయనే సామెత అందరికీ తెలిసిందే.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందనే చర్చ జరుగుతోంది.

Jagan

బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వాలతాయనే సామెత అందరికీ తెలిసిందే.. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్‌కు ఈ సామెత సరిగ్గా సరిపోతుందనే చర్చ జరుగుతోంది. సీఎంగా ఉన్న సమయంలో జై జగన్ అంటూ నినదించిన నేతలు అధికారం పోయిన తర్వాత.. పో జగన్ అంటున్నారట. సీఎంగా ఏం చేసినా కరెక్ట్‌ అంటూ వెనకేసుకొచ్చిన నాయకులు ప్రస్తుతం పార్టీలో ఉండలేమంటున్నారట. 2019 నుంచి 2024 మార్చి వరకు వైసీపీలో చేరేందుకు క్యూ కట్టిన నాయకులు.. ఇప్పుడు రాజకీయాలైనా వదిలేస్తాం.. కానీ వైసీపీలో ఉండలేమంటున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఉంటూ అధినేత అరాచక పాలనకు జై కొట్టి.. జగన్ చేసిన పొరపాట్లలో భాగస్వాములైన నాయకులను చేర్చుకునేది లేదని ఇప్పటికే టీడీపీ, జనసేన స్పష్టంచేయడంతో వైసీపీలో కొందరు నాయకులు అయోమయంలో పడ్డారట. వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న నేతలు పార్టీ మారదామంటే అవతల పార్టీల్లోకి నో ఎంట్రీ అంటుడటంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. మరికొందరు నేతలైతే రాజకీయ భవిష్యత్తు సంగతి తర్వాత.. మొదట వైసీపీ నుంచి దూరంగా ఉందామనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. మరికొద్ది రోజుల్లోనే ఓ ఎమ్మెల్సీ వైసీపీకి దూరమవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక విశాఖపట్టణంలో కొందరు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరిపోయారు. ఏలూరులోనూ కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

మీ కపట నాటకానికి మా సంఘీభావమా..!


వరుస రాజీనామాలు..

ఎన్నికల తర్వాత చాలా మంది సీనియర్లు వైసీపీలో యాక్టివ్‌గా లేరనే ప్రచారం జరుగుతోంది. ఓటమి తర్వాత ప్రెస్‌మీట్లు పెట్టినప్పటికీ.. ఆ తర్వాత పెద్దగా కనిపించడంలేదు. కొందరు జగన్‌ వ్యవహరశైలి నచ్చక దూరంగా ఉంటున్నారని.. వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నా సరిగ్గా స్పందిచడం లేదనే చర్చ జరుగుతోంది. ఈక్రమంలో కొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నారట. జిల్లాస్థాయి నేతలు మాత్రం వైసీపీకి గుడ్‌బై చెప్పి.. స్థానిక నాయకుల సమక్షంలో వైసీపీ, జనసేనలో చేరుతున్నారు. మరోవైపు జగన్ తన క్యాడర్‌ పార్టీ వీడి వెళ్తున్న అంశంపై స్పందించకుండా.. రాష్ట్రంలో శాంతి,భద్రతలు లేవనే ఒక అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చి పార్టీ మనగడను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.

పోలీసుల అదుపులో మాధవరెడ్డి సన్నిహితులు!


పొరపాట్లు తెలుసుకుంటారా..

అధికారంలో ఉన్నప్పుడు జై కొడితే ఇదే తన జన బలం అనుకున్నారు వైసీపీ అధినేత జగన్.. తన పార్టీ క్షేత్రస్థాయిలో ఎంతో బలంగా ఉందని.. మరో ఐదేళ్లు తనకు అధికారం గ్యారంటీ అంటూ జగన్ అంచనాలు వేశారు. కానీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలంతా ఆశ్చర్యపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అసలు బలం ఏమిటో జగన్‌కు తెలిసొచ్చింది. తనకు ఉన్నది ప్రజాబలం కాదని.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశాననే విషయం గుర్తొచ్చి ఉండాలి. మరోవైపు ఎన్నికల తర్వాత జగన్ ఐదేళ్లూ నమ్మిన కొందరు నాయకులు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ చుట్టూ తిరిగిన నేతల జాడ ప్రస్తుతం కనిపించడంలేదు. ఇప్పటికైనా జగన్ తన పొరపాట్లు తెలుసుకుని ముందుకెళ్తారా.. లేదా తన పాత పద్ధతినే కొనసాగిస్తారా అనేది మాత్రం రానున్న రోజుల్లో వేచి చూడాలి.


బీజేఎల్పీ నేతగా విష్ణుకుమార్‌రాజు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latets Telugu News

Updated Date - Jul 28 , 2024 | 10:55 AM

Advertising
Advertising
<