ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rammohan Naidu: కేంద్రమంత్రి రామ్మోహన్‌ను అభినందించిన లోక్‌సభ స్పీకర్

ABN, Publish Date - Aug 08 , 2024 | 12:08 PM

Andhrapradesh: కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రామ్మోహన్ టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. మూడు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉంటూ ఏపీలో అనేక సమస్యలపై పార్లమెంటులో గళమెత్తారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.

Union Minister Rammohan naidu

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కింజరాపు రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan naidu).. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన యువనేత. టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు. ఎంపీగా ఉంటూ ఏపీలో అనేక సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఏదైనా అంశంపై రామ్మోహన్ మాట్లాడితే శభాష్‌ అని.. వారెవ్వా సిక్కోలు సింగం అనకుండా ఉండలేరు. తాజాగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) అభినందనలు పొందారు రామ్మోహన్. ఇంతకీ ఏ విషయంలోనో చూద్దాం వచ్చేయండి..

Maharashtra politics: తమ్ముడు నేటి నుంచి.. అన్నయ్య రేపటి నుంచి..


పౌర విమానయాన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు.. సభ్యులకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. దీంతో రామ్మోహన్‌ నాయుడిని స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇస్తున్నారని స్పీకర్ కితాబిచ్చారు. పౌర విమానయాన శాఖపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రామ్మోహన్‌ నాయుడు సమాధానం ఇచ్చారు.

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి


దేశంలో ఎంఆర్‌ఓల ఏర్పాటుకు సంబంధించి భాగస్వామ్య పక్షాలు, పరిశ్రమలు, విమానయాన సంస్థలతో ఎలాంటి చర్యలు తీసుకుంది, కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న వారికి ఎలాంటి శిక్షణ ఇస్తుందని బీజేపీ సభ్యుడు దుష్యంత్‌ సింగ్‌ ప్రశ్నించారు. దీనిపై రామ్మోహన్ సమాధానమిస్తూ.. దేశంలో ఎంఆర్‌ఓల ఏర్పాటుకు తీసుకున్న చర్యలు, సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఏవిధంగా కృషి చేస్తుందో వివరించారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంచిగా సమాధానం చెపుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్‌కు స్పీకర్ ఓం బిర్లా కితాబిచ్చారు.


ఇవి కూడా చదవండి..

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ బట్టాచార్య మృతి

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. 70 గేట్లు ఎత్తివేత

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 08 , 2024 | 01:28 PM

Advertising
Advertising
<