ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loose Petrol.. ఎన్టీఆర్ జిల్లా: లూజ్ పెట్రోల్ నిలిపివేత

ABN, Publish Date - May 19 , 2024 | 08:02 AM

ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు దృష్టిలో పెట్టుకుని, ఇబ్రహీంపట్నంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండటంతో పెట్రోల్ బంక్‌లలో లూజ్ పెట్రోల్ పోయడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల యాజమాన్యంతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు.

ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు దృష్టిలో పెట్టుకుని, ఇబ్రహీంపట్నంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండటంతో పెట్రోల్ బంక్‌ (Petrol Bunk)లలో లూజ్ పెట్రోల్ (Loose Petrol) పోయడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈసీ (EC) ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల యాజమాన్యంతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు లూజు బాటిల్స్‌, కంటైనర్‌లో గానీ పెట్రోల్ అమ్మవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బంకుల ఎదుట నోటీసులు అంటించాలని పోలీసులు సూచించారు.


సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పెట్రోల్‌ బంకుల్లో వాహనాలకు మాత్రమే పెట్రోల్‌ పోయాలని, బాటిళ్లలో పెట్రోల్‌ పోయరాదని స్పష్టమైన ఆదేశాలుజారీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే అనంతర పరిణామాలకు బంకుల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో పెట్రోల్‌ బాంబులు(పెట్రోల్‌ బాటిల్స్‌)తో దాడి చేసిన ఉదంతాలు బయటపడటంతో పెట్రోల్‌ బంకుల డీలర్లకు పోలీసు, ఎన్నికల ఉన్నతాధికారు లు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇకపై పెట్రోల్‌ బంకు ల్లో వాహనాలకు మాత్రమే ఆయిల్‌ పోసేలా, బాటిళ్లు, క్యాన్లలో ఆయిల్‌ పోయకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పేరం రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు నిబంధనలు పాటించేలా బంకుల డీలర్లకు ఆదేశాలు జారీ చే శారు. ‘ఖాళీ సీసాల్లో, క్యానుల్లో పెట్రోల్‌ అమ్మబడుదు’ అని బంకుల ఎదుట నోటీసులు అంటించాలని డీలర్లకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 08:05 AM

Advertising
Advertising