ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Atchannaidu: మంత్రి ఆదేశాలతో ముంపు ప్రాంతాల్లో పశువులకు వైద్య సేవలు

ABN, Publish Date - Sep 02 , 2024 | 04:23 PM

Andhrapradesh: వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్‌లతో పశువులకు వైద్యం అందించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో జంతు వైద్య శిబిరాల ద్వారా పశువులకు వైద్య సేవలు అందించనున్నారు.

Minister Atchannaidu

అమరావతి, సెప్టెంబర్ 2: వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) సోమవారం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్‌లతో పశువులకు వైద్యం అందించనున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో జంతు వైద్య శిబిరాల ద్వారా పశువులకు వైద్య సేవలు అందించనున్నారు.

Hevay Rains: విల్లాస్‌లోకి వరద నీరు.. కబ్జా వల్లే ఈ స్థితి అంటూ..


విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల్లో బోట్లతో మత్స్యకారులు సేవలు చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 163 బోట్లతో 187 మంది మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద నేపథ్యంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులను వ్యవసాయ శాఖ అప్రమత్తం చేసింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Jagadish Reddy : భారీ వర్షాలపై ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం


కాగా.. భారీ వర్షాలకు వెలగలేరు జగనన్న లే అవుట్ బుడమేరు వరదలో పూర్తిగా మునిగిపోయింది. ఇంకా ముంపులోనే హెచ్.ముత్యాలంపాడు గ్రామం ఉంది. బుడమేరు వరద ధాటికి వందల ఎకరాల్లో పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆహార పంపిణీ ఎంత మేరకు చేశారో డివిజన్ల వారీగా సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

Deli Waqf Board case: 'ఆప్' ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్టు చేసిన ఈడీ

CM Chandrababu: పుడ్ డెలివరీ డ్రోన్లను సిద్ధం చేయండి.. సీఎం చంద్రబాబు ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 02 , 2024 | 04:24 PM

Advertising
Advertising