ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anagani: ఎమ్మెల్యే జగన్‌పై మంత్రి అనగాని ఫైర్

ABN, Publish Date - Aug 14 , 2024 | 04:17 PM

Andhrapradesh: పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నీ ఐదేళ్ల పాలనలో చేసిన మంచి అంటే ప్రజల భూములను కబ్జా చేయడం... ప్రశ్నించిన వారిని చంపేయడమా జగన్ రెడ్డి. నీవు అంతగా ప్రజలకు మంచి చేసి ఉంటే నీ పార్టీని ఎందుకు అత్యంత ఘోరంగా 11 సీట్లకే పరిమితం చేశారు’’ అని ప్రశ్నించారు.

Minister Anagani Satyaprasad

అమరావతి, ఆగస్టు 14: మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డిపై (Former CM YS Jagan Reddy) మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani Satyaprasad) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘నీ ఐదేళ్ల పాలనలో చేసిన మంచి అంటే ప్రజల భూములను కబ్జా చేయడం... ప్రశ్నించిన వారిని చంపేయడమా జగన్ రెడ్డి. నీవు అంతగా ప్రజలకు మంచి చేసి ఉంటే నీ పార్టీని ఎందుకు అత్యంత ఘోరంగా 11 సీట్లకే పరిమితం చేశారు’’ అని ప్రశ్నించారు.

Hyderabad Metro: నాగోల్ మెట్రో వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే?


మద్య నిషేధం చేస్తానని చెప్పి కల్తీ మద్యంతో వేలాది మంది ఆడపడుచుల తాళిబోట్లు తెంచిన సంగతిని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఇసుక దోపిడీ కారణంగా పనుల్లేక ఆకలితో చనిపోయిన భవన నిర్మాణ కార్మికులను ప్రజలింకా మర్చిపోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన నిమిషాల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఐదేళ్ల పాటు వారిని నిలువునా ముంచిన సంగతిని ఉద్యోగులు ఇంకా మరిచిపోలేదన్నారు. ఇచ్చిన హామీల్లో కేవలం 13 శాతం మాత్రమే అమలు చేసి ద్రోహం చేసినందునే ప్రజలు జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పరిమితం చేశారన్నారు.

Vasantha Krishna: జోగి తనయుడి అరెస్ట్‌పై ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఏమన్నారంటే?


‘‘నీ పరిపాలనలో రాష్ట్రం దివాళా తీసింది వాస్తవం కాదా జగన్ రెడ్డి? నీ హయాంలో ఉద్యోగులకు మొదటి తేదీనే ఎప్పుడైనా జీతాలు వచ్చాయా?’’ అని ప్రశ్నల వర్సం కురిపించారు. కూటమి పాలనలో అటు ప్రజలతో పాటు ఇటు ఉద్యోగులు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు హామీలపై సంతకాలు చేశారన్నారు. సుపరిపాలనకు మారుపేరైన తమ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Rajnath Singh: జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై రాజ్‌నాథ్ కీలక సమావేశం

Vasantha Krishna: జోగి తనయుడి అరెస్ట్‌పై ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఏమన్నారంటే?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2024 | 04:20 PM

Advertising
Advertising
<