AP Highcourt: కొల్లు రవీంద్ర పాస్‌పోర్టును పునరుద్దరించండి.. హైకోర్టు ఆదేశం
ABN , Publish Date - Sep 13 , 2024 | 12:16 PM
Andhrapradesh: మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్ట్‌లో ఊరట లభించింది. క్రిమినల్ కేసులతో సంబధం లేకుండా రవీంద్ర పాస్ పోర్ట్‌ను పునరుద్ధరించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదిన మంత్రి విదేశాలకు వెళ్తుండటంతో వెంటనే క్లియర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తన పాస్‌పోర్టును పునరుద్ధరించాలని పాస్‌పోర్ట్ అధికారులను గతంలో రవీంద్ర కోరారు.
అమరావతి, సెప్టెంబర్ 13: మంత్రి కొల్లు రవీంద్రకు (Minister Kollu Ravindra) హైకోర్ట్‌లో (AP HighCourt) ఊరట లభించింది. క్రిమినల్ కేసులతో సంబధం లేకుండా రవీంద్ర పాస్ పోర్ట్‌ను పునరుద్ధరించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదిన మంత్రి విదేశాలకు వెళ్తుండటంతో వెంటనే క్లియర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తన పాస్‌పోర్టును పునరుద్ధరించాలని పాస్‌పోర్ట్ అధికారులను గతంలో రవీంద్ర కోరారు. అయితే రవీంద్రపై క్రిమినల్ కేసులు ఉండటంతో పాస్ పోర్ట్ అధికారులు నిరాకరించారు.
CM Kejrival Bail: సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్
దీనిపై మంత్రి హైకోర్ట్‌ను ఆశ్రయించారు. ఈనెల 24 నుంచి 26 వరకు అమెరికాలో జరగనున్న మైన్ ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉందని.. అందుకే తన పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణకు రాగా.. వాదనలు అనంతరం క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా పాస్‌పార్ట్‌ను పునరుద్ధరించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే కేసు తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
Arekapudi Gandhi: బీఆర్‌ఎస్ నేతలను సాదరంగా ఆహ్వానిస్తా..
కాగా... పాస్‌పోర్టును పునరుద్దరించాలంటూ మంత్రి కొల్లురవీంద్ర నిన్న(గురువారం) హైకోర్టులో పిటిషన్ వేశారు. నిన్నటి విచారణలో క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో పాస్‌పోర్ట్‌ను తిరస్కరించొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టులు పలు సందర్భాల్లో తీర్పులిచ్చాయని పిటిషనర్ తరఫున లాయర్ ఎంవీ రమణకుమారి వాదనలు వినిపించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర హోంశాఖ, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పాస్‌పోర్ట్ అధికారిని ఆదేశించింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. మంత్రి పిటిషన్‌పై ఈరోజు మరోసారి విచారణ జరిపిన హైకోర్టు వెంటనే పాస్‌పోర్టును పునరుద్దరించాల్సిందిగా పాస్‌పోర్టు అధికారులను ఆదేశించింది
ఇవి కూడా చదవండి...
Lord Ganesh: గణేశ్ ప్రతిమ పట్టుకొని బాలుడి ఉద్వేగం
Virat Kohli: స్వదేశానికి వచ్చేసిన విరాట్.. మరో రికార్డుకు చేరువలో కోహ్లీ
Read Latest AP News And Telugu News