vasamsetti subhash: జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే తెలుసా?
ABN, Publish Date - Jul 05 , 2024 | 04:39 PM
Andhrapradesh: నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్లు అందరి ముందూ ఈవీఏం ధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో కూడా ఈవీఏం ధ్వంసం చేసినట్టు బయటపడిందన్నారు.
అమరావతి, జూలై 5: నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్ (Former CM Jagan) దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti Subhash) విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్లు అందరి ముందూ ఈవీఏం ధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో కూడా ఈవీఏం ధ్వంసం చేసినట్టు బయటపడిందన్నారు. అలాంటి నేరస్థుడైన వ్యక్తిని జగన్ ఎలా వెనకేసుకు వస్తారని ప్రశ్నించారు. అసలు ఆయనకు ప్రజాస్వామ్యం అంటే తెలుసా అని నిలదీశారు. పలనాడు ప్రాంతంలో ఫ్యాక్షనిస్టు, చాలా మందిని చంపిన వ్యక్తిని జగన్ వెనకేసుకు వచ్చారని.. దీనిని బట్టే ఆయన నైజం ఏమిటో తెలిసిపోతోందన్నారు.
NEET PG Exam Date: నీట్ పీజీ పరీక్ష తేదీలు విడుదల
సమయం ముగిసిపోయినా జగన్‌కు ములాఖత్ అవకాశం కల్పించారన్నారు. ఆర్థిక నేరస్తుడైన జగన్ జైల్లో ఉన్న ఓ ఫ్యాక్షనిస్టును కలిశారని... అందుకే 151 నుంచి 11 సీట్లకు దిగిపోయారని వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఇంకా వైసీపీ వాసనలు పోలేదని. త్వరలోనే అన్ని చోట్లా ప్రక్షాళన జరుగుతుందన్నారు. జగన్ ఇక తన సమయాన్ని జైళ్ళకు వెళ్లి పలకరింపులకే వెచ్చించాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. సజ్జల రెడ్డి, ధనుంజయ్ రెడ్డి లాంటి వారి కోసమే జగన్ ఇక ఓదార్పు యాత్రలు చేయాలంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Vinod Kumar: తెలంగాణ శాసన మండలి మనుగడకు ప్రమాదం
Viral Video: జుట్టు ఆరబెట్టేందుకు ఈమె వాడిన టెక్నిక్ చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
Read Latest AP News And Telugu News
Updated Date - Jul 05 , 2024 | 04:51 PM