ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Balashowry: ఏపీ ప్రజల కల నెరవేరబోతోంది... కేంద్రానికి ధన్యవాదాలు

ABN, Publish Date - Jul 23 , 2024 | 01:22 PM

Andhrapradesh: ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 కోట్లు ఇస్తామన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారన్నారు.

MP Vallabhaneni Balashauri

అమరావతి, జూలై 23: ఏపీకి (Andhrapradesh) కేంద్రం (Budget 2024) ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి (MP Vallabhaneni Balashowry) సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 కోట్లు ఇస్తామన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారన్నారు. దేశానికి ఆహార భద్రత కల్పించాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని కేంద్ర మంత్రి చెప్పారని అన్నారు.

KTR: అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌పై కేటీఆర్ అసంతృప్తి


పునరావాసం సహా మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా వేల కోట్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామన్నారన్నారు. చట్టం ప్రకారం చమురు శుద్ధి కేంద్రం, స్టీల్ ప్లాంట్ కూడా రావాల్సి ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు సంయుక్తంగా సాధించిన విజయం అని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ ఆర్కిటెక్ట్‌గా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విజయంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఏపీ ప్రజలు ఎంతో కాలంగా తమ రాజధాని కోసం ఎదురుచూస్తున్నారని... వారి కల నెరవేరబోతోందని ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు.


ఏపీకి ప్రత్యేక సాయం ఇదే...

ఏపీ విభజన చట్టం అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అమరావతి నిర్మాణంలో వివిధ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ఏపీకి కేంద్రం ప్రకటించింది. పోలవరం నిర్మాణానికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఏపీ జీవనాడిగా పేర్కొన్నారు. ఆహార భద్రతకు కూడా పోలవరం నిర్మాణం ఎంతో అవసరమని కేంద్రమంత్రి వెల్లడించారు. ఏపీలో నాలుగు రంగాల్లో కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తుందని తెలిపారు. నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయిస్తామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Madanapalle Fire Accident: మదనపల్లి అగ్నిప్రమాద ఘటనపై సీన్ రీ కన్‌స్ట్రక్షన్

Madanapalle fire accident: పది ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ.. నిజాలు బయటపడతాయా?

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 23 , 2024 | 03:20 PM

Advertising
Advertising
<