ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టులు.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:48 AM

ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై పరిశీలన జరుపుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా ఎయిర్ కనెక్ట్విటీ పెంచుతున్నామని చెప్పారు. కుప్పం, దగదర్తి, పుటపర్తిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

విజయవాడ: సీ ప్లేన్ సేవలు ప్రాంతీయ అనుబంధాలను మరింత పెంచుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. సీ ప్లేన్ కార్యకలాపాల కోసం 8ప్రాంతాలు ఇప్పటికే గుర్తించినట్లు తెలిపారు. రహదారులు భవనాల శాఖకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి ప్రోత్సహకం లభిస్తోందని తెలిపారు. ఆర్ధిక వృద్ధి, పర్యాటకాభివృద్ధికి విమానాశ్రయాలు పెంచుతున్నామని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణం ద్వారా ఎయిర్ కనెక్ట్విటీ పెంచుతున్నామని చెప్పారు. కుప్పం, దగదర్తి, పుటపర్తిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.


పున్నమిఘాట్‌ వద్ద పోలీసులు బందోబస్తు

పున్నమిఘాట్‌ వద్ద కృష్ణానదిపై ఇవాళ (శనివారం) ట్రయల్‌ రన్‌ జరుగుతుండటం, సీఎం చంద్రబాబు రానుండటంతో పోలీసులు బందో బస్తును కట్టుదిట్టం చేశారు. పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు శుక్రవారం ఘాట్‌ పరిసరాలను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత, పార్కింగ్‌, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. సీపీ వెంట ఇన్‌చార్జి కలెక్టర్‌ నిధిమీనా, డీసీపీలు గౌతమీశాలి, మునిసిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర, అధికారులు పాల్గొన్నారు.


పోలీసుల అత్సుత్సాహం..

పున్నమి ఘాట్ వద్ద పోలీసులు అత్సుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల చర్యలతో సందర్శకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆంక్షల పేరుతో పోలీసులు అత్సుత్సాహం చూపిస్తున్నారని సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవీఐపీలు, మంత్రుల సేవలో పోలీసులు తరిస్తున్నారని అంటున్నారు. సీ ప్లేన్ ఫ్లయింగ్ విన్యాసాలు చూడటానికి సైతం పాస్ ఉన్నవారికే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. మీడియాకు సైతం అనుమతి లేదంటూ పోలీసులు చిందులు తొక్కుతున్నారు.


పోలీసుల తీరుపై సందర్శకుల ఆగ్రహం

ప్రకాశం బ్యారేజీ చెంతన, పున్నమి ఘాట్‌ తీరాన కృష్ణానదిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సీప్లేన్‌ ట్రయల్‌ రన్‌ను ప్రారంభించడంతో పాటు సమీక్ష జరపనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సెమీ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఏవియేషన్‌ అధికారులు, సీప్లేన్‌ నిర్వాహకులు, జిల్లా అధికారులు, పోలీసుల సమక్షంలోనే ఈ సెమీ ట్రయల్‌ రన్‌ జరిగింది. హరిత బెర్మ్‌పార్క్‌లో జరిగిన ఈ విన్యాసాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శుక్రవారం ఉదయాన్నే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సీ ప్లేన్‌ను తీసుకొచ్చి వాటర్‌జెట్టీ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత గంటకు సెమీ ట్రయల్‌ రన్‌ జరిగింది. నీటిపై విమానం దూసుకుపోవటంతో పర్యాటకులు ఆసక్తిగా చూశారు. ప్రకాశం బ్యారేజీ, బరమ్‌ పార్కు, భవానీ ద్వీపం మీదుగా చక్కర్లు కొట్టింది. చివరిగా శ్రీశైలం వెళ్లింది.


నేటి ట్రయల్‌ రన్‌ ఇలా..

శనివారం ఉదయం 9 గంటలకు ప్రకాశం బ్యారేజీ దగ్గర, పున్నమిఘాట్‌ సమీపాన సీ ప్లేన్‌ ల్యాండ్‌ అవుతుంది. దీనిని జెట్టీ పాయింట్‌ వద్ద పార్క్‌ చేస్తారు. ముందుగా ఐఅండ్‌ఐ సెక్రటరీ ఎస్‌.సురేష్‌కుమార్‌, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి, విమాన తయారీ సంస్థ అయిన డీ హవిలాండ్‌ (డీహెచ్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆఫ్‌ కెనడా లిమిటెడ్‌ అధికారులు ర్యాన్‌ డెబ్రుస్క్‌, యోగేష్‌ గార్గ్‌ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్‌సీఎస్‌ ఉడాన్‌ సీప్లేన్లకు సంబంధించి ఏవీ ప్రదర్శిస్తారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు, చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత ట్రయల్‌ రన్‌కు ఆహ్వానించిన వారిని విమానంలోకి ఎక్కించుకుని శ్రీశైలం బయల్దేరుతారు. ఈ ప్లేన్‌ శనివారం మధ్యాహ్నానికి శ్రీశైలం వెళ్తుంది. ఈ రన్‌తో దక్షిణ భారతదేశంలో ఈ ఘనత సాధించిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలవనుంది. విజయవాడ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సీప్లేన్‌లను రూపొందించారు.


రెండున్నర గంటల్లోనే శ్రీశైలానికి..

విజయవాడ-శ్రీశైలం మధ్య రాకపోకలు సాగించే పర్యాటకులు, భక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ సీప్లేన్‌ సేవలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. దీనిద్వారా పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కనుంది. ఈ సరికొత్త సీప్లేన్‌లో మొత్తం 14 సీట్లు ఉంటాయి. విజయవాడ-శ్రీశైలం మధ్య రోడ్డు, రైలుమార్గం కంటే అతి తక్కువ సమయంలో శ్రీశైలం వెళ్లొచ్చు. ఇందుకు కేవలం రెండున్నర గంటల సమయమే సరిపోతుంది. షెడ్యూల్‌, టికెట్ల రేట్లను త్వరలోనే ప్రకటిస్తారు. కాగా, సీప్లేన్‌ సేవలపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగానికి ఇది ఎంతో తోడ్పాటు అందిస్తుందని పర్యాటకాభిమానులు చెబుతున్నారు.


ఏర్పాట్లపై ఇన్‌చార్జి కలెక్టర్‌ సమీక్ష

సీప్లేన్‌ ట్రయల్‌ రన్‌ కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ నిధిమీనా సూచించారు. ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆమె వివిధ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు శనివారం ఉదయం 10.45 గంటలకు పున్నమి ఘాట్‌ వద్దకు చేరుకుంటారని చెప్పారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పలు సూచనలు చేశారు.

Updated Date - Nov 09 , 2024 | 12:00 PM