ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pattiseema Project: పట్టిసీమ వస్తుందహో..

ABN, Publish Date - Jul 03 , 2024 | 01:01 AM

ఐదేళ్ల తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకం మళ్లీ కళకళలాడనుంది. గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా పడకేసి రైతులకు సాగు నీటి కష్టాలను మిగిల్చింది.

Pattiseema Project

  • నేడు నీటిని విడుదల చేయనున్న మంత్రి నిమ్మల

  • ఐదేళ్ల తర్వాత మళ్లీ కళకళ

పోలవరం, జూలై 2 : ఐదేళ్ల తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకం మళ్లీ కళకళలాడనుంది. గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా పడకేసి రైతులకు సాగు నీటి కష్టాలను మిగిల్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు బుధవారం ఉదయం 7.27 గంటలకు నీటిని విడుదల చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా రైతులు సాగు నీటి కోసం ఇబ్బం దులు పడకూడదనే దృక్పథంతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు రూ.1,600 కోట్లతో ఏడాది వ్యవధిలోనే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీని నుంచి 1800 క్యూ సెక్కుల జలాలు పంపిణీ జరిగేది. దీని ద్వారా ఏటా నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేసేవారు.


టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఆరంభం నుంచి 2019 రబీ సీజన్‌ వరకూ 305.07 టీఎంసీల నీటిని కృష్ణా, రాయలసీమ, ఉమ్మడి పశ్చిమ డెల్టాలకు పంపిణీ చేసింది. తర్వాత వైసీపీ పాలనలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నాలుగేళ్లు పడకేయించి రైతుల ఉసురు పోసుకుంది. 2020లో 4.5424 టీఎంసీలు, 2021లో 1.6417 టీఎంసీలు పంపిణీ చేసింది. నాలుగేళ్లలో 58.7421 టీఎంసీలు మాత్రమే ఇచ్చింది. దీనివల్ల రైతులకు సాగు నీరందక, పంటలు నష్టపోయి విరామం పాటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది పంటలకు సాగు నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు పట్టిసీమ నేటి నుంచి జీవధార కానుందని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 03 , 2024 | 10:38 AM

Advertising
Advertising