Venigandla Ramu: గుడివాడ ప్రజల నీటి కష్టాలకు కారణం వారే..
ABN, Publish Date - Apr 06 , 2024 | 10:51 AM
Andhrapradesh: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యంతో గుడివాడ ప్రజలకు నీటి కష్టాలు వచ్చాయని కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం జిల్లాలోని గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్‌లో రాము పర్యటించారు. కూటమి పార్టీల నేతలతో కలిసి మున్సిపల్ త్రాగునీటి చెరువుల్లో నీటి నిల్వలను పరిశీలించారు. పాతచెరువుకు మూడేళ్ల క్రితం పడిన గండిని పూడ్చకపోవడంతో అక్కడి పరిస్థితులను రాము మీడియాకు చూపించారు.
కృష్ణా జిల్లా, ఏప్రిల్ 6: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యంతో గుడివాడ ప్రజలకు నీటి కష్టాలు వచ్చాయని కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము (TDP Leader Venigandla Ramu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం జిల్లాలోని గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్‌లో రాము పర్యటించారు. కూటమి పార్టీల నేతలతో కలిసి మున్సిపల్ త్రాగునీటి చెరువుల్లో నీటి నిల్వలను పరిశీలించారు. పాతచెరువుకు మూడేళ్ల క్రితం పడిన గండిని పూడ్చకపోవడంతో అక్కడి పరిస్థితులను రాము మీడియాకు చూపించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గుడివాడలో ఏ వార్డుకు వెళ్లినా త్రాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
AP Politics: ముస్లిం మహిళపై వైసీపీ నేత భార్య దాష్టీకం
రిజర్వాయర్లు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అన్ని వసతులు ఉన్నప్పటికీ ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేకపోతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయంలో ప్రణాళిక బద్ధంగా పనిచేసేవాళ్ళమని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే అంటే ప్రజల అవసరాలపై అవగాహన కలిగి ఉండాలని... దేశ రాజకీయాలు తప్ప గుడివాడ ప్రజల సమస్యలు ఎమ్మెల్యే పట్టవని మండిపడ్డారు. కాలవలు వదిలిన తర్వాత అయినా... అధికారులు బాధ్యత తీసుకొని పూర్తిస్థాయిలో నీరు నింపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాదిలో పాత చెరువు గండి పూడ్చి.. ఆ చెరువును కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. సరైన సమయంలో ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే నేడు తాగు నీరు అందక ప్రజలు కష్టపడుతున్నారన్నారు. పాత చెరువుకు మూడేళ్ల క్రితం పడిన గండి పూడ్చకపోవడంతో 36 ఎకరాల చెరువు వినియోగంలో లేకుండా పోయిందని వెనిగండ్ల రాము విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
Pawan Kalyan: పవన్ కోసం ఇల్లు సిద్ధం.. ఎక్కడంటే..
Arvind Kejriwal: జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న కేజ్రీవాల్‌కు మరో షాక్?
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 06 , 2024 | 11:36 AM