ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amarnathreddy: ‘ఆవేశపడకు బొత్సా’.. అమర్నాథ్ కౌంటర్

ABN, Publish Date - Jul 06 , 2024 | 04:40 PM

Andhrapradesh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమావేశానికి సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స చేసిన ట్వీట్‌పై టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రలు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందంటూ బొత్స ట్వీట్ చేశారు.

Amarnath Reddy strong counter to Botsa

అమరావతి, జూలై 6: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమావేశానికి సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ( Former Minister Botsa satyanarayana) చేసిన ట్వీట్‌పై టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి (TDP MLA Amarnath Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందంటూ బొత్స ట్వీట్ చేశారు. దీనిపై అమర్నాథ్ స్పందిస్తూ.. ‘‘ఆవేశపడకు బొత్సా.. అక్కడ ఉంది జగన్ కాదు, చంద్రబాబు.. మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా అప్పనంగా ఏపీ భవనాలు అప్పగించింది మర్చిపోలేదు.. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తాని చెప్పిన మాటలు మర్చిపోలేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

CMs Meet: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ..


బందర్ పోర్టులో వాటా ఇస్తామని చెప్పిన విషయం మర్చిపోలేదన్నారు. తాళాలు పగలగొట్టి ఏపీ ఆయుష్ భవనాన్ని స్వాధీనం చేసుకుంటే నోరు మూసుకున్న విషయం మర్చిపోలేదన్నారు. పోలవరం నీళ్ళు కేసీఆర్ (Former CMd KCR) తీసుకుని వెళ్తామని చెప్పిన మాట మర్చిపోలేదని ఆయన అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించమని జగన్‌కు చెప్పానని కేసీఆర్ చెప్పింది మర్చిపోలేదన్నారు. కేసీఆర్ కాళ్ళ మీద విజయసాయి రెడ్డి (Vijayasaireddy) పడిన విషయం మర్చిపోలేదని విమర్శించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏపీ ప్రయోజనాల కోసమే పని చేస్తారని స్పష్టం చేశారు. సీనియర్ నేతగా రెండు తెలుగు రాష్ట్రాల బాగు కోసమే పని చేస్తారన్నారు. ‘‘మీ లాగా కేసులు కోసం, ఆస్తులు కాపాడుకోవలసిన పని ఆయనకు లేదు’’ అంటూ అమర్నాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Nimmala: నాడు - నేడు పథకంతో దోపిడీ.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

Satyakumar: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 04:41 PM

Advertising
Advertising
<