TDP-YSRCP: సవాళ్లు.. ప్రతిసవాళ్లు... తిరువూరులో ఉద్రిక్తత
ABN, Publish Date - Aug 24 , 2024 | 02:02 PM
Andhrapradesh: తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రతి సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో తిరువూరు పట్టణం బోసుబొమ్మ వద్దకు ఈరోజు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేరుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించారంటూ సాక్షి మీడియాకి, వైసీపీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు.
ఎన్టీఆర్ జిల్లా, ఆగస్టు 24: తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రతి సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో తిరువూరు పట్టణం బోసుబొమ్మ వద్దకు ఈరోజు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (MLA Koliapudi Srinivas) చేరుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ (YSRCP) నేతలు ఇసుక, గ్రావెల్ అక్రమంగా తరలించారంటూ సాక్షి మీడియాకి, వైసీపీ నేతలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు.
CM Ramesh: వైసీపీ ఏపీకి తీరని అన్యాయం చేసింది
ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించిన వైసీపీ నేతలు.. టీడీపీ, వైసీపీ పార్టీ నేతలు బహిరంగంగా చర్చించేందుకు బోసుబొమ్మ సెంటర్‌కు వెళ్లేందుకు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు. వైసీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఉన్నారు.
ఈ వార్త కూడా చదవండి...
అచ్యుతాపురం ప్రమాద ఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై కార్మిక శాఖ మంత్రి సుభాష్ మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా ప్రమాదం ఘటనను మాజీ సీఎం జగన్ రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ‘‘జగన్‌కు ఇదే నా సవాల్’’.. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు ఏనాడు కార్మికుల సంక్షేమం పట్టలేదు అని అన్నారు. అసలు కార్మికుల ప్రాణాలపై ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించిందన్నారు. గత వైసీపీ పాలనలో పారిశ్రామిక ప్రమాదాల్లో కార్మికులు మరణించినప్పుడు సీఎం హోదాలో జగన్ ఏ రోజు తక్షణం పరామర్శకు రాలేదని గుర్తుచేశారు. భవనిర్మాణ కార్మికులను జగన్ వేధించారని.. వారి నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. అలాంటి జగన్ ఇప్పుడు కార్మికుల బాగోగుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందంటూ మంత్రి సుభాష్ వ్యాఖ్యలు చేశారు..
ఇవి కూడా చదవండి...
Nagarjuna: ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంటే ఏంటీ..?
Subhash: జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి సుభాష్
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 24 , 2024 | 02:09 PM