ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Venkaiah Naidu: ప్రస్తుత సినిమాలపై వెంకయ్య నాయుడు షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Aug 12 , 2024 | 12:51 PM

తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కొనియాడారు. ఆచంట వెంకటరత్నం కాంస్య విగ్రహన్ని సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.

Venkaiah Naidu

విజయవాడ: తెలుగు నాటక ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం నాయుడు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కొనియాడారు. ఆచంట వెంకటరత్నం కాంస్య విగ్రహన్ని సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... నాటకాలను ఆచంట వెంకటరత్నం వారసత్వం కొనసాగించాలని కోరారు. వినోదం ప్రజల వద్దకు రాక ముందు నాటకాలే ప్రజలకు వినోదమని వివరించారు. ఆ కాలంలో వచ్చిన నాటకాలు ప్రజలను మంచి మార్గంలో నడిపించాయని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గొప్ప నటులని ప్రశంసించారు. సినిమాకి పై పై పుతలు పూయాల్సిన అవసరం ఉంటుంది. కానీ నాటకం నిజమని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాటకం కష్టమైందని... ప్రతి డైలాగ్ గుర్తు పెట్టుకొని స్టేజ్‌పై ప్రదర్శన చేయాలని వెంకయ్య నాయుడు వెల్లడించారు.


నాటకాలపై ప్రశంసలు..

‘‘సినిమాని చిన్నచూపు చూసే ఆలోచన కాదు... కానీ నాటకం సినిమా కంటే గొప్పదని చెబుతున్నాను. ప్రస్తుత సినిమాలు అసభ్య పదజాలంతో వస్తున్నాయి. హీరోనే చెడు మాటలు మాట్లాడుతున్నారు. బూతులు మాట్లాడే వారికీ ప్రజలు అలాగే సమాధానం చెప్పారు. ప్రతి ఒక్కరూ తెలుగులోనే మాట్లాడండి . చదువు మొదట మాతృభాషలో పరిజ్ఞానం నేర్చుకోవాలి. తర్వాత ఏ మీడియం అయినా చదువుతారు. దయచేసి సినిమాలో తెలుగు డైలాగులు రాయండి. ప్రజాపరిపాలన ప్రజల భాషలో ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రపతి మాతృభాషలో చదువుకొని రాష్ట్రపతి అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాన్వెంట్‌కి వెళ్లలేదు. మంచి స్థాయిలో ఉన్నా వారు అందరు వారి మాతృభాషలోనే చదువుకున్నారు. కానీ నాటకంలో భాష చాలా బావుంటుంది. జానపద సాహిత్యం నుంచి ఉన్నాది నాటకాలు వచ్చాయి. మార్పు మంచిదే కానీ మనుగడను కోల్పోకూడదు. నాటకాలు చూసే వారు ఇంకా ఉన్నారు. స్వతంత్ర సమయంలో నాటకాలే ప్రజల్లో స్ఫూర్తిని నింపాయి. సినిమా ప్రభావంతో నాటకాలు కొంత మనుగడ కోల్పోతున్నాయి. కానీ వారికీ ప్రభుత్వం చేయిత అందిస్తే పోటీ ప్రపంచంలో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటాయి. గొప్ప గొప్ప నాయకులు నాటకాలు చూస్తూ పెరిగారు. నాటక రంగం విరజిల్లాలనే ఉద్దేశ్యంతోనే ప్రముఖ రంగస్థల నటులు ఆచంట వెంకటరత్నం విగ్రహాన్ని ఆవిష్కరించారు. సినిమా ఆకర్షణ కాకుండా ప్రచార మాధ్యమాలు కూడా నాటక రంగానికి తగు ప్రాధాన్యత కల్పించాలి’’ అని వెంకయ్య నాయుడు వెల్లడించారు.

Updated Date - Aug 12 , 2024 | 02:19 PM

Advertising
Advertising
<