ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: ఏది వాస్తవం?.. వైసీపీ సర్కార్‌పై లక్ష్మీనారాయణ ఫైర్..

ABN, First Publish Date - 2024-02-07T17:28:58+05:30

AP Politics: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జై భారత్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. బడ్జెట్ సెషన్‌ను వైసీపీ ఎన్నికల ప్రచార పర్వంలా మార్చేశారని ఫైర్ అయ్యారు.

VV Laxmi Narayana

అమరావతి, ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జై భారత్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. బడ్జెట్ సెషన్‌ను వైసీపీ ఎన్నికల ప్రచార పర్వంలా మార్చేశారని ఫైర్ అయ్యారు. రూ. 4.25 ల‌క్షల కోట్ల న‌గ‌దు బదిలీతో పేద‌రికం తొలగించామ‌ని ఆర్ధిక మంత్రి ఆత్మవంచ‌న చేసుకున్నార‌ని విమర్శించారు లక్ష్మీనారాయణ. అప్పులు చేసి డ‌బ్బులు పంచితే, అది పేద‌రిక నిర్మూల‌న ఎలా అవుతుంది? అని నిలదీశారు. 43 ల‌క్షల మంది విద్యార్థుల‌కు గోరు ముద్ద, 35 ల‌క్షల మంది పిల్లల‌కు సంపూర్ణ పోష‌ణ అని లెక్కలు చెప్పారని, మరి ఇందులో వాస్తవ‌మెంత? అని ప్రశ్నించారాయన.

ఎన్నిక‌ల ప్రచార బ‌డ్జెట్‌లా, చివ‌రికి ఎన్నిక‌ల ముందు హ‌డావుడిగా టీచర్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు లక్ష్మీనారాయణ. అంత అభివృద్ధి ఉంటే తెల్లకార్డులు ఎందుకు త‌గ్గడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. రోడ్లు ఎందుకు వేయ‌డం లేదన్నారు. యువ‌త ఉపాధి కోసం ఎందుకు వ‌ల‌స పోతున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు లక్ష్మీనారాయణ.

Updated Date - 2024-02-07T17:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising