ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh Politics: జగన్ ఢిల్లీ వ్యూహం బెడిసికొట్టిందా..

ABN, Publish Date - Jul 25 , 2024 | 07:48 AM

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి, భద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్తలను రాష్ట్రంలో బతకనీయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా బెడిసికొట్టిందా.. హస్తినలో నిరసనతో ఆయన ఏం సాధించారు.

Jagan

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి, భద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్తలను రాష్ట్రంలో బతకనీయడం లేదంటూ వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా బెడిసికొట్టిందా.. హస్తినలో నిరసనతో ఆయన ఏం సాధించారు. కేవలం మీడియా ప్రచారం కోసమే దేశ రాజధానిలో ధర్నా చేశారా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి జూన్4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అదే నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎంగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి 50 రోజులైనా గడవలేదు. ఈలోపే రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం విఫలమైందంటూ విపక్ష వైసీపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. మొదటి రోజు నుంచే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే వ్యూహంతోనే వైసీపీ ముందుకెళ్తుందనే చర్చ సైతం నడుస్తోంది. ఏదైనా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన గాడిలో పడేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది. కానీ కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగించడం ద్వారా పరోక్షంగా రాష్ట్రానికి, అక్కడి ప్రజలకు వైసీపీ అన్యాయం చేస్తోందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

వ్యవస్థలను కుప్పకూల్చారు!


ధర్నాతో ఏం సాధించారు..

ఢిల్లీలో జగన్ ఏ ఎజెండాతో ధర్నా చేశారనేది పార్టీ శ్రేణులకే అర్ధం కాలేదట. వాస్తవానికి ఏదైనా పార్టీ లేదా ప్రజా సంఘాలు, వ్యక్తులు ధర్నా, నిరసనలు చేసేటప్పుడు పలు డిమాండ్లను ప్రభుత్వం లేదా ప్రజల ముందు ఉంచడం సర్వ సాధారణం. కానీ ఏపీలో పరిస్థితులు దేశానికి తెలియాలంటూ ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏదైనా రాష్ట్రంలో శాంతి, భద్రతల సమస్య ఏర్పడినా, అసాంఘిక ఘటనలు జరిగినా వెంటనే ప్రజలకు తెలిసిపోతుంది. దేశం మొత్తం ఆ ఘటనలపై చర్చించకున్న సందర్భాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణ మణిపూర్ ఘటన.. ఆ రాష్ట్రంలో శాంతి, భద్రతల సమస్య ఏర్పడినప్పుడు దేశం మొత్తం మణిపూర్ గురించే చర్చించుకుంది. ఈశాన్య రాష్ట్రమైనా.. అక్కడ ఏం జరుగుతుందో జాతీయ మీడియా ప్రజల ముందుంచిది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో నిజంగానే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తితే ఇప్పటికే జాతీయ మీడియా మొత్తం దానినే ప్రచారం చేసేది. అలా జరగలేదంటే ఏపీలో శాంతి,భద్రతలు నియంత్రణలో ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. కానీ వైసీపీ అధినేత మాత్రం ఏపీలో ఏదో జరిగుతోందంటూ ఒక అపోహను ప్రజల్లో కలిగించేందుకు మినహా ఢిల్లీ ధర్నా ద్వారా ఆయన సాధించిదేమి లేదనే చర్చ జరుగుతోంది. ఐదేళ్లు అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఏ రోజు ధర్నా చేయని జగన్.. అధికారం కోల్పోయిన తర్వాత ధర్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Chandrababu : కిక్కు లెక్క తేలుస్తాం


వ్యూహం బెడిసి కొట్టిందా..

ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా దేశం మొత్తం దృష్టిని ఆకర్షించవచ్చని.. తన గురించి చర్చ జరుగుతుందని.. తద్వారా ఏపీలో శాంతి, భద్రతలు అదుపులో లేవనే సందేశాన్ని పారిశ్రామికవేత్తలకు ఇవ్వడమే లక్ష్యంగా జగన్ కుట్రపూరితంగా ఢిల్లీలో ధర్నా చేశారనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా దేశ ప్రజలు గతంలో సీఎంగా చంద్రబాబు పనిచేసిన రోజులను చూశారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది ప్రపంచం చూసింది. ఈక్రమంలో లేనిపోని అంశాలను తెరపైకి తెచ్చి.. ప్రభుత్వంపై బురద వేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తున్న ప్రభుత్వం నైతికస్థైర్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే జగన్ కుట్ర పన్నారని.. చివరకు ఆయన వ్యూహం ఫలించలేదనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.


ఢిల్లీ వీధుల్లో జగన్‌ ధర్నా

పెద్దిరెడ్డి ఖాతాలో ‘అసైన్డ్‌’

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra pradesh News and Latest Telugu News

Updated Date - Jul 25 , 2024 | 07:48 AM

Advertising
Advertising
<