Share News

సాగు విస్తీర్ణం పెంచాలి: డీఏవో

ABN , Publish Date - Nov 27 , 2024 | 12:15 AM

తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రంలో ఏడాదికే డాది సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ సూచించారు.

సాగు విస్తీర్ణం పెంచాలి: డీఏవో
తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రంలో కందిపంటను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి

జూపాడుబంగ్లా, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రంలో ఏడాదికే డాది సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ సూచించారు. మండలంలోని తంగడంచ విత్తనోత్పత్తి క్షేత్రాన్ని ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. క్షేత్రం ఏడీఏ అరుణలతను క్షేత్రంలో సాగువిస్తీర్ణం, బీడుభూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగుచేసిన కందిపంటను పరిశీలించారు. ప్రభుత్వం జంగిల్‌ క్లియరెన్సు చేయిస్తే సాగువిస్తీర్ణం పెంచడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి కిశోర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వెలుగోడు: రైతులు పంట పొలాల్లో భూసారాన్ని పెంచుకుని సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ సూచిం చారు. అబ్దుల్లాపురంలో నిర్వహించిన పొలం పిలు స్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏవో పవన్‌ కుమార్‌, పశువైద్యాధికారిణి జ్యోత్స్న, సెరికల్చర్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌, ఏఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 12:15 AM