Share News

Minister: వేసవిలో విద్యుత్‌ కోతలుండవ్..

ABN , Publish Date - Apr 11 , 2025 | 12:06 PM

ప్రస్తుత వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కోతలుండవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పెరగనున్న విద్యుత్‌ వినియోగానికి దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ కొనుగోలు చేయనున్నామని తెలిపారు.

Minister: వేసవిలో విద్యుత్‌ కోతలుండవ్..

- విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజి

చెన్నై: వేసవిలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజి(Minister Senthil Balaji) తెలిపారు. కోయంబత్తూర్‌లో గురువారం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యుత్‌ కోతలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. అత్యవసర మరమ్మతులకు కొద్దిసేపు సరఫరాకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Maoists: మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం..


nani2.2.jpg

వేసవిలో పెరగనున్న విద్యుత్‌ వినియోగానికి దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌ కొనుగోలు చేయనున్నామని తెలిపారు. సుప్రీంకోర్టు బిల్లులను ఆమోదించిన వ్యవహారంలో రాష్ట్రానికే కాకుండా దేశానికి మార్గదర్శకంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) నిలిచారని కొనియాడారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని న్యాయపోరాటం చేశారన్నారు. ఇది ఒక చరిత్రాత్మక విజయంగా భావిస్తున్నామని మంత్రి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Adilabad: కన్నీటి కష్టాలు

గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించాలి

పేదలకు మూడు రంగుల కార్డులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 11 , 2025 | 12:06 PM