Srisailam: సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి
ABN, Publish Date - Oct 11 , 2024 | 09:49 AM
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు తొమ్మిదవరోజుకు చేరుకున్నాయి. మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సిద్ధిదాయిని అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు.
నంద్యాల జిల్లా: శ్రీశైలం (Srisailam)లో దసరా మహోత్సవాలు (Dussehra celebrations) వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు తొమ్మిదవరొజుకు చేరుకున్నాయి. మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సిద్ధిదాయిని అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా మహాత్సవాలను పురస్కరించుకుని ఇవాళ సాయంత్రం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయ రెడ్డి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీ స్వామి అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అశ్వవాహనంపై ఆశీనులై పూజలందుకొనున్న అది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. కాగా ఎనిమిదో రోజు గురువారం భ్రమరాంబిక అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అత్యంత శాంతమూర్తిగా కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం వాహనసేవలో భాగంగా మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి నందివాహనంపై దర్శనమిచ్చారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కావడంతో మల్లన్న క్షేత్రం భక్తులతో కళ కళలడుతోంది. భక్తులు వేకువజామునుంచే పవిత్ర పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి ఆలయ క్యూలైన్‌లలో.. కంపార్టుమెంట్లలో బారులు తీరారు. దీంతో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. భక్తులు శ్రీస్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్ది అధికంగా ఉండటంతో క్యూ లైన్స్,కంపార్టుమెంట్లలో అల్పాహారం, పాలు, బిస్కెట్లు మంచి నీరు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయవాడ: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..
ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Oct 11 , 2024 | 09:50 AM