ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crypto currency Scam: క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు

ABN, Publish Date - Nov 03 , 2024 | 08:04 PM

డోన్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు రూ. 25 కోట్లను రామాంజనేయులు అనే మోసగాడు వసూలు చేశాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు రూ.10వేలు ఇస్తామంటూ కేటుగాడు నమ్మబలికాడు.

నంద్యాల: డోన్‌లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు రూ. 25 కోట్లను రామాంజనేయులు అనే మోసగాడు వసూలు చేశాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు రూ.10వేలు ఇస్తామంటూ కేటుగాడు నమ్మబలికాడు. కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో 300 మందికి పైగా భాదితులు ఉన్నట్టు సమాచారం. రామాంజనేయులును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. డోన్‌లో 2021 నుంచి కేవ-ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలకు కేటుగాడు పరిచయం అయ్యాడు. గతంలో అనంతపురంలో రూ. 90 లక్షలు మోసం చేసినట్టు రామాంజనేయులుపై అభియోగాలు వచ్చాయి. రామాంజనేయులు అనంతపురం జిల్లా పెద్దవడుగురు వాసిగా పోలీసులు గుర్తించారు.


అప్పులు చేసి పెట్టుబడులు..

నంద్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గల పలు గ్రామాలు, మండలాల్లో కొన్ని నెలలుగా క్రిప్టో దందా జోరుగా జరుగుతోంది. రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు సంబందిత వర్గాలు అంటున్నాయి. పదుల సంఖ్యలో మా ర్కెట్‌లో చలామణి అవుతున్న పలు యాప్‌లలో పెట్టుబడులు పెట్టి వందల సంఖ్యలో బాధితులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా జరుగుతున్న చర్చ ఒక్కటే...ఆన్‌లైన్‌ వ్యాపారంలో ‘నేను ఇంత పెట్టాను..నువ్వు ఎంత పెట్టావు’ అని. ఇలా ఆన్‌ లైన్‌లో పెట్టుబడి పెట్టిన వారు ఎదుటి వారిని ప్రభావితం చేసేందుకు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి చెందిన పదుల సంఖ్యలో గల యాప్‌ బ్లాక్‌ చైన్‌ దందాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ ఆన్‌లైన్‌ మోసపూరిత దందాలో పెట్టుబడులు పెడితే తక్కవ కాలంలో ఎక్కువ లాభాలు గడించవచ్చనే కేటుగాళ్ల మాటలతో నిత్యం ఎంతో మంది సామాన్యులు దందాల వైపు ఆకర్శితులవుతున్నారు. అప్పులు చేసి దందాలో పెట్టుబడులు పెట్టి మోసానికి గురవుతున్నారు.


వెలుగులోకి క్రిప్టో కరెన్సీ తతంగం ....

నంద్యాల జిల్లాలో క్రిప్టో కరెన్సీ తతంగం బయటకు వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందాలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు, వ్యాపారులు, యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రియల్‌ వ్యా పారులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కుటుంబాలు ఈ దందాలో తమ శక్తికి మించి పెట్టుబడులు పెట్టాయి.


ఆన్‌లైన్‌ చైన్‌ దందాలతో లబోదిబో..

పేరు ఏదైనప్పటికీ ఆన్‌లైన్‌ చైన్‌ దందాలన్నీ ఒకేలా పనిచేస్తున్నాయి. మొదట్లో ఆకాశానికెత్తే లాభాలు చూపుతాయి. మెల్లగా చైన్‌ లింక్‌ దందాలో ఇరికిస్తాయి. ‘ఇక నువ్వు కూడా ఓ అయిదుగురికి చేరిస్తేనే నీకు లాభాలు వస్తాయి’. అనే పరిస్థితికి తీసుకువస్తాయి. అధిక లాభాలు వస్తాయన్న అత్యాశతో రూ. లక్షల్లో పెట్టిన పెట్టుబడితో పాటు ఎంతో కొంత లాభాలను పొందాలని ఆ దందాల్లో కూరుకు పోతున్నారు. తాజాగా జిల్లాలో బయటపడిన యూనిట్‌ బిజినెస్‌లో ఇలా ఇరుక్కుపోయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇందులోనూ అధికశాతం మధ్య తరగతి కుటుంబాలవారే. గతంలోనూ చాలా ఆన్‌లైన్‌ దందాలు ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేశాయి.


వారిని చూసే..

పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, అధికారులే నేరుగా క్రిప్టో కరెన్సీ దందాలో ఉండటమే జిల్లాలో వేగంగా విస్తరించడానికి కారణం. గతంలో చాలా ఆన్‌లైన్‌ దందాలు నిర్వాహకులు చేసినట్లే.. ఇందులోనూ సమాజంలో కొంత పేరుండి, వాళ్లు చెబితే పదిమంది వింటారు. అనే వారినే ఎంచుకుంటున్నారు. ప్రధానంగా గ్రామాల్లో పలువురు ఉద్యోగులు, నేతలు, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగులు, అధికారులు, వైద్యులు ఇలా...కొన్ని ప్రభావిత వర్గాలను ఎంచుకుని వారిపైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టి మరీ చేర్చుకుంటున్నారు. వారు కూడా అత్యాశకు గురై ఈ దందాలోకి రావడంతో వీరిని నమ్మి మిగిలిన వారంతా చేరుతూ మోసపోతున్నారు.

Updated Date - Nov 03 , 2024 | 08:14 PM