ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉద్రిక్తత..

ABN, Publish Date - Aug 24 , 2024 | 02:54 PM

నంద్యాల స్టేట్ బ్యాంక్ కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహానందీశ్వర స్వామి దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు తొలగిస్తు్ండగా.. ఆక్రమణదారులు దేవాదాయశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా వాతావరణం వేడెక్కింది

నంద్యాల: పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహానందీశ్వర స్వామి దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు తొలగిస్తు్ండగా.. ఆక్రమణదారులు దేవాదాయశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా వాతావరణం వేడెక్కింది.


నంద్యాల పట్టణంలోని మహానందీశ్వరస్వామికి చెందిన దాదాపు 3.78ఎకరాల్లోని 2ఎకరాల భూమిలో అక్రమంగా ఇళ్లులు కట్టారు. గతంలో వాటిని తొలగించేందుకు దేవాదాయశాఖ అధికారులు ప్రయత్నించగా ఆక్రమణదారులు అడ్డుకున్నారు. దీంతో 27మందిపై కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ భూములు తమవే అంటూ వారంతా కోర్టుకు వెళ్లారు. విచారణ అనంతరం భూములు దేవాదాయశాఖకు చెందినవిగా కోర్టు తీర్పునిచ్చింది. నిర్మాణాలు తొలగించి స్వాధీనం చేసుకోవాలని తీర్పులో పేర్కొంది.


తీర్పు వచ్చిన నేపథ్యంలో అధికారుల బృందం జేసీబీలు తీసుకుని భవనాలు తొలగించేందుకు వెళ్లారు. పెద్దఎత్తున చేరుకున్న స్థానికులు దేవాదాయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ ఇళ్లు కూల్చేందుకు ఒప్పుకోమంటూ ఆందోళనకు దిగారు. వారి నిరసనతో ఘటనా స్థలానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Big Update: ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతలో బిగ్ ట్విస్ట్...

TDP-YSRCP: సవాళ్లు.. ప్రతిసవాళ్లు... తిరువూరులో ఉద్రిక్తత

Updated Date - Aug 24 , 2024 | 02:56 PM

Advertising
Advertising
<