Murder Case: టీడీపీ నేత ఏవీ శ్రీదేవి హత్య కేసులో 6గురి అరెస్టు
ABN, Publish Date - Jul 04 , 2024 | 12:52 PM
నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ శ్రీదేవి హత్య కేసులో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న పాతూరు వీధిలో శ్రీదేవి హత్య జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారయ్యారు.
నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ (Allagadda)లో టీడీపీ నేత ఏవీ శ్రీదేవి (AV Sridevi) హత్య కేసు (Murder Case)లో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న పాతూరు వీధిలో శ్రీదేవి హత్య జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారయ్యారు. అయితే వారిని ఆళ్లగడ్డలోని శిల్పాకళా మందిరం దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఇంకా ఎంతమంది ఉన్నారన్నదానిపై విచారణ చేస్తామని, ఫిజికల్‌గా అయితే ఈ ఘటనలో ఆరుగురు మాత్రమే పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి, వీడియో, సాక్షులు ఉన్నారని పోలీసులుపేర్కొన్నారు.
ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన టీడీపీ మహిళా కార్యకర్త, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అత్యంత సన్నిహితురాలు అట్ల శ్రీదేవి(55) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రమేష్‌బాబు తెలిపారు. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులైన భార్య, ముగ్గురు కూతుళ్లపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధానంగా హత్య కేసులో పాల్గొన్న వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు. భర్త భాస్కరరెడ్డి వైద్యశాలలో కోలుకుంటున్నట్లు సీఐ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ కార్యాలయాల జోలికి వస్తే ఖబడ్దార్..
అమరావతిపై శ్వేతపత్రం విడుదల (ఫోటో గ్యాలరీ)
ఆకాశమే హద్దుగా.. అమరావతి: సీఎం చంద్రబాబు
మోదీతో టీ20 వరల్డ్ కప్ విజేతల భేటీ నేడు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 04 , 2024 | 01:16 PM