ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Liquor Rates: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. భారీగా తగ్గిన లిక్కర్ రేట్స్

ABN, Publish Date - Dec 21 , 2024 | 12:33 PM

Liquor Rates: మద్యం ప్రియులకు అదిరిపోయే శుభవార్త. లిక్కర్ రేట్స్ భారీగా తగ్గాయి. త్వరలో న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ నేపథ్యంలో లిక్కర్ లవర్స్‌కు ఇది సూపర్ న్యూస్ అనే చెప్పాలి.

Alcohol Rates

ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం ప్రియులకు లిక్కర్ కంపెనీలు సూపర్ న్యూస్ చెప్పాయి. లిక్కర్ బేసిక్ రేట్స్‌ను గణనీయంగా తగ్గించాయి. వైసీపీ హయాంలో మద్యం మూల ధరను భారీగా పెంచేసిన సరఫరా కంపెనీలు.. ఇప్పుడు వాటంతట అవే రేట్స్‌ను తగ్గించుకోవడం గమనార్హం. అప్పటి సర్కారు పెద్దలు ఆయా కంపెనీల నుంచి కమీషన్లు తీసుకునేందుకు వీలుగా వాటికి చెల్లించే బేసిక్ రేట్స్ భారీగా పెంచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చింది.


ఆ బ్రాండ్ల ధరలు తగ్గింపు!

నూతన మద్యం విధానంతో వినియోగదారుల డిమాండ్‌కు తగ్గట్లుగా పారదర్శకంగా ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ తరుణంలో దాదాపు 11 లిక్కర్ కంపెనీలు వాటి బేసిక్ ప్రైజ్‌ను తగ్గించుకొని మద్యం ప్రియులకు ఊరట కలిగించాయి. దీంతో ఆయా కంపెనీల నుంచి స్టేట్ బేవరేజెస్ కంపెనీ మద్యం కొనే ధర తగ్గింది. ఆయా బ్రాండ్లను బట్టి ధరల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీ మీద రూ.30 దాకా తగ్గింది. అదే ఫుల్ బాటిల్‌పై సుమారు రూ.90 నుంచి రూ.120 వరకు రేట్లు తగ్గాయి. త్వరలో కొత్త ఏడాది, సంక్రాంతి పండుగలు రానుండటంతో మద్యం ధరల తగ్గింపుపై లిక్కర్ లవర్స్ సంబురపడుతున్నారు.


Also Read:

ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు.. ఎక్కడంటే?

అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం ఆదేశాలు

భవానీ దీక్ష విరమణలు.. సీపీ కీలక వ్యాఖ్యలు

For More AP And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 12:38 PM