Share News

ఓటరు జాబితాలో లోపాలపై శాసనమండలి మాజీ ఛైర్మన్ ఫిర్యాదు

ABN , Publish Date - Feb 05 , 2024 | 07:23 PM

ఫైనల్ ఓటర్ జాబితాలో అవకతవకలపై ఎలక్షన్ కమిషన్‌కు శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు చేశారు. ఓటర్ జాబితాలో ఇంకా లోపాలు ఉన్నాయని వాటిని తక్షణమే సరిదిద్దాలని షరీఫ్ పేర్కొన్నారు.

ఓటరు జాబితాలో లోపాలపై శాసనమండలి మాజీ ఛైర్మన్ ఫిర్యాదు

అమరావతి:ఫైనల్ ఓటర్ జాబితాలో అవకతవకలపై ఎలక్షన్ కమిషన్‌కు శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ఫిర్యాదు చేశారు. ఓటర్ జాబితాలో ఇంకా లోపాలు ఉన్నాయని వాటిని తక్షణమే సరిదిద్దాలని షరీఫ్ పేర్కొన్నారు. ఓటర్ కార్డుల్లో పేర్లు, ఇంటి నంబర్లు తప్పులున్నాయన్నారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించలేదని షరీఫ్ పేర్కొన్నారు. మరణించిన వారి పేరుతో ఒకటికి మించిన ఓట్లున్నాయన్నారు.

ఒకే డోర్ నంబర్లతో వందలాది ఓట్లు ఇంకా కొనసాగుతున్నాయని షరీఫ్ తెలిపారు. ఒకే ఓటు వేర్వేరు నియోజకవర్గాల్లో ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా స్థానికంగా లేరంటూ వేలాది ఓట్లు తొలగించారన్నారు. జిల్లాల వారీగా ఓట్ల అవకతవకలపై ఆధారాలు సమర్పించారన్నారు. ఓటర్ జాబితా తప్పిదాలపై సాక్ష్యాధారాలు, వార్తా కథనాలను అందించారన్నారు. తక్షణమే ఓటర్ జాబితాలను ప్రక్షాళన చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కుల్ని కాపాడాలని ప్రధాన ఎన్నికల కమిషన్‌కు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Feb 05 , 2024 | 07:23 PM